Shorts మార్టూరు: మార్టూరు మండల పరిధిలోని బొల్లాపల్లి గ్రామానికి చెందిన బేడ బుడగ జంగం సామాజిక వర్గానికి చెందిన 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వారికి తెలుగుదేశం పార్టీ కండవాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. చిత్తారి చిన్న పెద్దన్న, కప్పెర అంజయ్య, తూర్పాటి పెద్ద వెంకటయ్య, కప్పెర రవిబాబు, విభూది హనుమంతుతో పాటు 20 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమన్నారు. టీడీపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు, నాయకులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమానికి ఆకర్షితులై పలువురు పార్టీలో చేరారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ముద్దన హనుమంతరావు , గొట్టిపాటి నరసింహారావు అడ్డగడ్డ నాగేశ్వరరావు, కుక్కపల్లి వెంకట్రావు, కరణం మారుతి తదితరులు పాల్గొన్నారు