Kaizer News

Mulugu: విద్యార్థుల యూనిఫార్మ్ స్టిచింగ్ సెంటర్‌ను

Mulugu: విద్యార్థుల యూనిఫార్మ్ స్టిచింగ్ సెంటర్‌ను పరిశీలించిన ఐటీడీఏ పీవో!

· State - Telangana · hmtvlive.com

Shorts ములుగు: ITDA ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ లెనిన్ వత్సల్ విద్యార్థుల యూనిఫార్మ్‌లను కుట్టే స్టిచింగ్ సెంటర్‌ను సందర్శించి, యూనిఫార్మ్‌ల తయారీ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా స్టిచింగ్ సెంటర్‌లో యూనిఫార్మ్‌ల కుట్టు పనులు చేస్తున్న టైలర్లతో ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు మాట్లాడి, ఇప్పటివరకు పూర్తయిన పనులు, మిగిలి ఉన్న పనుల వివరాలను తెలుసుకున్నారు. విద్యార్థులకు యూనిఫార్మ్స్ సకాలంలో అందేలా మిగిలిన స్టిచింగ్ పనులను వేగవంతం చేసి అన్ని యూనిఫార్మ్‌ల కుట్టు పనులు పూర్తిచేయాలని టైలర్లను ఆదేశించారు. యూనిఫార్మ్‌ల కుట్టు పనుల్లో నాణ్యతను పాటిస్తూ, విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. పనుల పురోగతిని సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా డీడీ (TW) శ్రీ జానార్ధన్ పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News