Kaizer News

Markapur: మార్కాపురంలో ఘనంగా అభివృద్ధి కార్యక్రమాల

Markapur: మార్కాపురంలో ఘనంగా అభివృద్ధి కార్యక్రమాలు!

· State - Telangana · hmtvlive.com

Shorts Markapur: మార్కాపురం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం మార్కాపురం జిల్లాను సాధించడంతో పాటు వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నల్లమలసాగర్‌కు నీరు అందిస్తోందన్నారు. హార్టికల్చర్ హబ్, ఇంటింటికీ తాగునీటి పైప్‌లైన్, మెడికల్ కాలేజీ వంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు వద్దకు రోజూ వేలాది మంది సందర్శకులు వస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే కందుల విమర్శించారు. వైసీపీ ఇన్‌చార్జ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ “మీ నాయకులకు ఏమైంది చక్రవడ్డీతో తీర్చుకుంటారా?” అంటూ ప్రశ్నించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సంపూర్ణ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు వక్కలగడ్డ మల్లికార్జున, మార్కెట్ యార్డు చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News