రాహుల్ గాంధీ పూణేలో జరిగిన ‘యువతి గర్జన’ ఛాత్రోంకి గూంజ్‌లో వేలాదిమంది యువతులు పాల్గొన్నారు. ఆ సమావేశంలో రాహుల్ ఒక కొత్త ప్రయోగం చేశాడు. విద్యార్థినులైన అమ్మాయిలు ఎటువంటి పురుష దురహంకారాన్ని ఎదుర్కొంటున్నారు? ఇంట్లో, బయట కాలేజీల్లో, యూనివర్సిటీల్లో తాము ఎదుర్కొంటున్న హింసాత్మక అణచివేత పద్ధతులేమిటి అనే అంశాలపైన వారిచేతనే మాట్లాడించాడు. స్త్రీ–పురుష సమానత్వం కావాలి అని అమ్మాయిల నినాదాలతో మారుమోగిన ఆ భారీ సభలో ఆయన దేశంలో 70 కోట్ల మంది స్త్రీలు ఏ రంగాలలో అసమాన, అవమానకర జీవితాన్ని అనుభవిస్తున్నారో ముందుగానే తయారుచేయించిన స్లైడ్ ద్వారా పర్సంటేజీలతో సహా వారికి వివరించాడు. వారి జీవిత అనుభవాల నుంచే ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న భారతీయ స్త్రీ విముక్తికి ఏ మార్గాలు ఉన్నాయో చెప్పించాడు. ఆ వేదిక మీద మను ధర్మశాస్త్రం బాల్యంలో స్త్రీలు తండ్రి చేతిలో, యవ్వనంలో భర్త చేతిలో, వృద్ధాప్యంలో కొడుకు చేతిలో ఎలా బందీ అయి బతకాలని మనువు రాశాడో కొటేషన్ స్లైడ్‌లో వేసి వారందరి ముందు చదివాడు. ఈ మను ధర్మ సిద్ధాంతం వ్యవస్థాగతమైనందువల్ల పితృస్వామ్యం గ్రిప్ భారతదేశంలో ఏ ఇతర దేశాల్లో, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో లేనివిధంగా స్త్రీని అణచివేస్తుందని యువతులకు అర్థమయ్యే రూపంలో చెప్పాడు. పితృస్వామ్యాన్ని బద్దలు కొట్టు ఈ క్రమంలో ఆయన ఈ దేశంలో పితృస్వామ్య వ్యవస్థను బద్దలుకొట్టాల్సిన అవసరం ఉందని డిక్లేర్ చేశాడు. ఆ విద్యార్థినుల సమావేశంలో అన్ని మతాలవాళ్లు ఉన్నారు. ఒక ముస్లిం అమ్మాయిచేత ప్రత్యేకంగా కుటుంబ స్థాయిలో, సమాజంలో తాము ఎటువంటి అణచివేతను, హింసను ఎదుర్కొంటున్నారో చెప్పించాడు. ఈ దేశంలో మతంతో సంబంధం లేకుండా పితృస్వామ్య అణచివేత స్త్రీలను తీవ్రంగా వేధించి అణచివేస్తున్నది. అది ఈ దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి కాకుండా అడ్డుకుంటున్నది. అందువల్ల అన్ని మతాల్లో స్త్రీలు–పురుషులతో సమానత్వం సాధించకుండా ఈ దేశ కుటుంబాలు, కులాలు, మతాలు, దేశం అభివృద్దిలోకి రావు. ఈ మౌలిక సమస్యను ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన అతిపెద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుడు, దేశ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ మొట్టమొదటిసారి పితృస్వామ్యాన్ని, మను ధర్మ శాస్త్రాన్ని, స్త్రీలు అన్నిరంగాలలో ఎదుర్కొంటున్న అణచివేతలను బద్దలుకొట్టే స్టాండ్ తీసుకున్నారు. ఇటువంటి స్త్రీ స్వేచ్చా స్టాండ్ ఒక్క అంబేద్కర్ మాత్రమే తీసుకుని చాలా రచనలు చేశాడు. స్త్రీ–పురుష సమానత్వం సాధించడానికి కొన్ని మార్గాలు సూచించాడు. అందులో ఆనాడు ఆయన ప్రతిపాదించిన హిందూ కోడ్ బిల్లు.. దానిని కాంగ్రెస్ నాయకులు, ఆర్ఎస్ఎస్, పురాతన విలువలను పాటించే బ్రాహ్మణ స్త్రీలు కూడా ఆయన హిందూకోడ్ బిల్లును వ్యతిరేకించారు. అది వాళ్ల ఇండ్లలో పురుషుల చేత మెప్పు పొందడానికి చేసినపని, వారి ఒత్తిడి, భయంతో చేసినది