సాక్షి, చైన్నె: కేంద్ర ప్రభుత్వ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రత్యక్ష నియంత్రణలో ఉన్న ప్రధాన మెట్రోపాలిటన్ విమానాశ్రయంగా చైన్నె కూడా ఉన్న విషయం తెలిసిందే. కాగా దేశంలోని పలు ప్రధాన విమానాశ్రయాలు ఇప్పటికే అదానీ గ్రూప్ వంటి ప్రైవేట్ బహుళజాతి సంస్థల నియంత్రణలోకి వెళ్లాయి. ఈ తరుణంలో చైన్నె విమానాశ్రయ నిర్వహణలో మార్పు కోరుతూ తమిళనాడు సీఎం విజయ్... ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రహస్యంగా లేఖ రాసినట్టుగా వెలువడ్డ సమాచారం రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతోంది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణంగా తీవ్రంగా వ్యతిరేకిస్తాయి. అయితే ఇందుకు విరుద్ధంగా, తమిళనాడు ప్రభుత్వమే స్వయంగా విమానాశ్రయ నిర్వహణ మార్పునకు లేఖ రాయడంపై సామాజిక కార్యకర్తలు, రాజకీయ విశ్లేషకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిపాలనా మార్పు ముసుగులో అదానీ లేదా జీఎంఆర్ వంటి కార్పొరేట్ సంస్థలకు చైన్నె విమానాశ్రయాన్ని పూర్తిగా కట్టబెట్టేందుకే ఈ ప్రయత్నం జరుగుతోందని ఆరోపణలు బయలుదేరాయి. కాంచీపురం జిల్లా పరందూరులో గతంలో ప్రకటించిన వేల కోట్ల విలువైన కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ ప్రాజెక్టును టీవీకే ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది. ఒకవైపు కొత్త ప్రాజెక్టును రద్దు చేస్తూ, మరోవైపు ఉన్న విమానాశ్రయాన్ని ప్రైవేటీకరించాలని కోరుతూ రహస్య లేఖ రాయడం సర్వత్రా చర్చకు దారి తీసినట్టైంది. ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించే కూటమిలోని వామపక్షాలు, ఇతర పార్టీలు ప్రభుత్వ ఈ వైఖరిపై తీవ్ర దిగ్భ్రాంతిని, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలకు రాష్ట్ర ప్రభుత్వం రహస్యంగా మద్దతు ఇస్తున్నదా? అనే అనుమానాలు వ్యక్తమవుతుండటంతో, ప్రభుత్వం దీనిపై తగిన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై బీజేపీ మహిళా నేత వానతీ శ్రీనివాసన్ స్పందిస్తూ, సీఎం విజయ్ ప్రధాన మంత్రి మోదీకి రాసిన లేఖఫై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ప్రైవేటీకరణ వ్యవహారం అనుమానాలకు దారి తీస్తున్నట్టు పేర్కొన్నారు. గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు బ్లాక్ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్ ఠాకూర్ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!