ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ : మండలంలోని ఏమయికుంట గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పవర్ వికాస్ (30) సర్వీసింగ్ సెంటర్‌లో ఆటోను కడుగుతుండగా నీటిలో విద్యుత్ ప్రసారం కావడంతో షాక్‌కు గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే గ్రామ సర్పంచ్, కుటుంబ సభ్యులు అద్దె కారులో వికాస్‌ను ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వికాస్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య అక్షితతో పాటు ఆరు నెలల చిన్నారి ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పంచనామా నిర్వహిస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు సమాచారం. వికాస్ మృతితో ఏమయికుంట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి