Kaizer News

Tirumala: తిరుమలలో వైభవంగా శ్రీవారి గరుడసేవ!

Tirumala: తిరుమలలో వైభవంగా శ్రీవారి గరుడసేవ!

· State - Telangana · hmtvlive.com

Shorts Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం రాత్రి అత్యంత వైభవంగా గరుడసేవ జరిగింది. విశేషంగా అలంకరించిన గరుడ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిచ్చి కటాక్షించారు. గజరాజులు ముందు నడుస్తుండగా, భక్త బృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు భక్తిభావంతో సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ “గోవిందా... గోవిందా...” అంటూ స్వామివారిని దర్శించుకున్నారు. 108 వైష్ణవ దివ్యదేశాల్లో గరుడసేవకు అత్యంత విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. గరుడుడు జ్ఞాన, వైరాగ్యాలకు ప్రతీకగా భావించబడతాడు. గరుడ వాహనంపై స్వామివారిని దర్శించుకోవడం సర్వపాప ప్రాయశ్చిత్తానికి, జ్ఞానవైరాగ్య ప్రాప్తికి దోహదం చేస్తుందని భక్తుల విశ్వాసం. ఈ గరుడసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ డా. ఎస్. వేంకటేశ్వర్, జేఈవోలు డా. ఎ. శరత్, శ్రీ ప్రభల గోపీనాథ్, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, సీవీఎస్వో శ్రీ కె.వి. మురళీకృష్ణ, ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీ శ్రీధర్ వర్మ తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News