Kaizer News

Nellore: ఆరోపణలు అబద్ధమైతే సీబీఐ విచారణకు సిద్ధమా?

Nellore: ఆరోపణలు అబద్ధమైతే సీబీఐ విచారణకు సిద్ధమా?

· State - Telangana · hmtvlive.com

Nellore: ఆంధ్రప్రదేశ్ మైనింగ్ వ్యవస్థను 'డౌ' అనే ఒక చైనా జాతీయుడు శాసిస్తున్నాడని, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (వీపీఆర్) అండదండలతోనే ఈ ముఠా దందా నడుస్తోందని వైఎస్సార్సీపీ పీఏసీ మెంబర్, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ 'మల్టీ ఎలిమెంట్' కంపెనీకి చెందిన 'డౌ' అనే చైనీయుడు స్థానిక మైనింగ్ సిండికేట్‌ను గుప్పిట్లో పెట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు. తమ కంపెనీకే క్వార్ట్జ్ మెటీరియల్ ఇవ్వాలని, లేకపోతే అధికారుల ద్వారా మైన్లు బ్లాక్ చేయిస్తానని లోకల్ మైన్ ఓనర్లను తీవ్రంగా బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఆరోపించారు. వీపీఆర్ అండ చూసుకునే ఆ చైనీయుడు ఇంతలా రెచ్చిపోతున్నాడని, అసలు 'డౌ'తో స్థానిక నాయకుడు వీపీఆర్‌కు ఉన్న సంబంధం ఏమిటో ఎంపీ తక్షణమే రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఒక చైనా వ్యక్తి ఇక్కడికొచ్చి మన వ్యవస్థను శాసించడం కచ్చితంగా దేశద్రోహమేనని, ఇది మన దేశ భద్రతకు కూడా ముప్పని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మైనింగ్ రంగంలో దారుణమైన దోపిడీ జరుగుతోందని అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి నేతల అండతో నడుస్తున్న సిండికేట్ ఆగడాలను ఆధారాలతో సహా బయటపెట్టారు. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు, వాస్తవానికి ఉన్న సంపదను ఆవిరి చేసే కార్యక్రమానికి తెరలేపారని విమర్శించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో క్వార్ట్జ్ మైనింగ్ ద్వారా ఖజానాకు రూ.55 కోట్లు ఆదాయం వస్తే, నేడు అది కేవలం రూ.11 కోట్లకు పడిపోయిందని గణాంకాలను ప్రదర్శించారు. దీనికి ప్రధాన కారణం మల్టీ ఎలిమెంట్ కంపెనీకి చెందిన డౌ అనే చైనా జాతీయుడు లోకల్ మైనింగ్ వ్యవస్థను శాసించడమేనని ఆరోపించారు. స్థానిక నేత వీపీఆర్ అండదండలతోనే ఈ చైనా వ్యక్తి సిండికేట్ నడుపుతూ, లీగల్ మైన్ ఓనర్ల నుంచి టన్నుకు 8 వేల నుంచి 15 వేల రూపాయల వరకు కప్పం వసూలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఫినీ క్వార్ట్జ్ పేరుతో నడుస్తున్న ఈ సిండికేట్ గత రెండేళ్ల వ్యవధిలోనే సుమారు 200 కోట్ల రూపాయలకు పైగా అక్రమ వసూళ్లకు పాల్పడిందని వివరించారు. వీరి దౌర్జన్యాలకు తలొగ్గని కారణంగా జిల్లాలోని 147 లీజుల్లో 49 మైన్లను ఉద్దేశపూర్వకంగా మూసివేయించారని, దీంతో ఒక్కో మండలంలో సుమారు 3 వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి కనుసన్నల్లోనే 2000 సంవత్సరాల పురాతనమైన సిద్ధుల కోన ఆస్తులను సైతం వదలకుండా అక్రమంగా ఫెల్స్‌పార్ మైనింగ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని సవాల్ విసిరిన అనిల్ కుమార్ యాదవ్, చైనా జాతీయుడి ఆగడాలపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. ఈ కూటమి ప్రభుత్వంలో మైన్ ఓనర్లు పడుతున్న ఇబ్బందులు, దారుణాలను ఆధారాలతో బయటపెట్టడానికే నేను మళ్లీ మీ ముందుకు వచ్చాను. మేము చాలా సత్యహరిశ్చంద్రులం, అవినీతి రహిత పరిపాలన చేస్తున్నాం అని ఈ కూటమి ప్రభుత్వం చెబుతోంది. స

Original source: hmtvlive.com
Read more on Kaizer News