Kaizer News

Rampachodavaram: రంపచోడవరంలో ఎమ్మెల్యే శిరీషాదేవి

Rampachodavaram: రంపచోడవరంలో ఎమ్మెల్యే శిరీషాదేవి ప్రజాదర్బార్‌!

· State - Telangana · hmtvlive.com

Shorts Rampachodavaram: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా సేవలంది స్తున్నట్లు రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పేర్కొన్నారు. రాజవొమ్మంగి మండలం వట్టిగెడ్డ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆమె APIIC డైరెక్టర్, మండల పార్టీ అధ్యక్షులు గొల్లపూడి పెద్దిరాజు ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో ఎలాంటి సమస్యలు ముందుగా స్థానిక మండల నాయకత్వానికి తెలియజేయాలని సూచించారు. అక్కడ కూడా పరిష్కారం కాకపోతే తన వద్దకు వస్తే పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే పలు రకాల మౌలిక సదుపాయాలు కల్పన కొరకు, పలు వ్యక్తిగత సమస్యలపై పలు వినతులు రాగా స్పందించిన ఆమె సంబంధిత అధికారులకు చరవాణిలో మాట్లాడి తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. మరియు పరిష్కారం చేసిన పిదప తన దృష్టిలో పెట్టాలని సూచించారు. దరఖాస్తుదారులతో మాట్లాడిన ఆమె ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తనతో చెప్పే అవకాశం ఉందన్నారు. తమ కార్యాలయంలో అయిన తెలియజేస్తే వెంటనే స్పందించి పరిష్కారం చేస్తామన్నారు. కొన్ని సమస్యలపై పారదర్శకంగా ప్రాధాన్యత క్రమంలో అన్నింటిని క్రమానుగుణంగా UC పరిష్కారం చేయనున్నట్లు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆమె వెంట APIIC డైరెక్టర్,మండల పార్టీ అధ్యక్షులు గొల్లపూడి పెద్దిరాజు, AMC చైర్మన్ లోతా లక్ష్మణరావు, రాజవొమ్మంగి సొసైటీ చైర్మన్ ముప్పన కేశవ్, AMC డైరెక్టర్ గట్టి మాణిక్యం, నియోజక వర్గ తెలుగు మహిళ నాయకులు ముప్పన సావిత్రి, నియోజక వర్గ బీసీ విభాగం ఉపాధ్యక్షులు మాకిరెడ్డి లోవరాజు, మండల తెలుగుయువత అధ్యక్షులు బారంగి అనుదీప్, మండల నాయకులు జెట్టి మధు, మండల పార్టీ ఉపాధ్యక్షులు సూరిశెట్టి సురేష్, తెదేపా నాయకులు వానపల్లి చిట్టిబాబు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News