బోనాల జాతర సందర్భంగా చీర తయారీ ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని పోచమ్మ తల్లి దేవాలయంలో శ్రావణమాస పౌర్ణమి నుంచి ప్రారంభమయ్యే బోనాల జాతర సందర్భంగా చేనేత కళాకారులు ప్రత్యేకంగా చీరను తయారు చేస్తున్నారు. దేవాలయంలో ఏర్పాటు చేసిన చేనేత మగ్గంపై కళాకారులు తమ నైపుణ్యంతో సారే చీరను నేస్తున్నారు. ఈ సందర్భంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి గుజ్జ అశోక్ శనివారం మగ్గాన్ని సందర్శించారు. చీర నేస్తున్న చేనేత కళాకారులను శాలువాతో సన్మానించి అభినందించారు. చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో నారాయణ సిద్ధిరాములు, మంత్రి భాస్కర్, చిట్టి మిల్ల సిద్ధులు, ఆడెపు రాములు పాల్గొన్నారు