కాగజ్ నగర్, వెలుగు : కుమ్రంభీం ఆసిఫాబాద్జిల్లా సిర్పూర్(టి) రేంజ్ రావణ్ పల్లిలో పులి దాడిలో ఓ ఎద్దు చనిపోయింది. మేడిపల్లి గ్రామానికి చెందిన మర్సకోల తెలంగరావుకు చెందిన ఎద్దు శనివారం మేత కోసం రావణ్ పల్లి అటవీ ప్రాంతానికి వెళ్లింది. సాయంత్రం వరకూ ఎద్దు తిరిగి రాకపోవడంతో రైతు అడవిలో గాలించగా.. ఎద్దు కళేబరం కనిపించింది. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం ఉదయం అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి పులి దాడి చేసి చంపేసినట్లు నిర్ధారించారు. సిర్పూర్ రేంజ్ లో పెద్దపులుల సంచారం ఉన్న నేపథ్యంలో పర్మిషన్ లేకుండా ఎవరూ అటవీ ప్రాంతానికి వెళ్లొద్దని ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ హెచ్చరించారు