Kaizer News

కుటుంబాన్ని కాపాడాలనే తపన.. ఆకట్టుకుంటున్న దృశ్యం

కుటుంబాన్ని కాపాడాలనే తపన.. ఆకట్టుకుంటున్న దృశ్యం ది కంక్లూజన్ ఫస్ట్ లుక్ పోస్టర్

· State - Telangana · v6velugu.com

అజయ్ దేవగణ్‌‌ హీరోగా హిందీలో రూపొందుతున్న ‘దృశ్యం’ ఫ్రాంచైజీలో మూడో భాగం రిలీజ్‌‌కు రెడీ అవుతోంది. ‘దృశ్యం ది కంక్లూజన్’ టైటిల్‌‌తో అక్టోబర్‌‌‌‌ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్రంలోని ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్స్‌‌ను రిలీజ్ చేశారు మేకర్స్. నందిని సాల్గావోంకర్‌‌‌‌ పాత్రలో కుటుంబం కోసం ఎంత దూరమైనా వెళ్లే తల్లి పాత్రలో శ్రియా శరణ్ లుక్ అందర్నీ ఆకట్టుకుంటుంది. తలుపు వెనుకనుంచి బయటకు చూస్తున్న ఆమె ముఖంలో భయం, అప్రమత్తత, ఏదో దాచాల్సిన పరిస్థితి అన్న భావాలు కనిపిస్తున్నాయి. ఆమె పాత్రలో ప్రధానంగా కనిపించేది కుటుంబాన్ని కాపాడాలనే తపన. పరిస్థితులు ఎంత క్లిష్టమైనా తన కుటుంబానికి అండగా నిలబడే వ్యక్తిగా ఈ పోస్టర్ ఆమెను పరిచయం చేస్తోంది. ఇక తన భర్త విజయ్ సాల్గావోంకర్‌‌‌‌గా మరోసారి అజయ్ దేవగణ్ లుక్ ఇంప్రెస్ చేస్తోంది. ఇక మీరా దేశ్‌‌ముఖ్‌‌గా టబు, మహేశ్ దేశ్‌‌ముఖ్‌‌గా రజత్ కపూర్, ఇంద్రజిత్ శెట్టిగా ప్రకాష్ రాజ్, రజ్‌‌వీర్ సింగ్ తోమర్‌‌‌‌గా జైదీప్ అహ్లవత్ లుక్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. రెండో భాగం ముగిసిన చోటు నుంచే ఈ కథ ప్రారంభం కానుంది. అయితే ఈసారి కథను సరికొత్త స్క్రీన్‌‌ప్లేతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ తెలియజేశారు. దీంతో గతంలో దాచిన నిజం ఈసారి బయటపడుతుందా? అనే ఉత్కంఠ రేపుతోంది

Original source: v6velugu.com
Read more on Kaizer News