Kaizer News

Vijayawada: దళిత కుటుంబాలకు న్యాయం జరిగేలా న్యాయవా

Vijayawada: దళిత కుటుంబాలకు న్యాయం జరిగేలా న్యాయవాదులు కృషి చేయాలి!

· State - Telangana · hmtvlive.com

Vijayawada: సమాజంలో దళితుల పట్ల కొనసాగుతున్న అసమానతలు, వివక్ష తొలగిపోయేలా ప్రతి దళిత కుటుంబానికి న్యాయం అందించేందుకు ఎస్సీ మోర్చా లీగల్‌ సెల్‌లోని న్యాయవాదులు కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి నూకల మధుకర్‌ పిలుపునిచ్చారు. అక్రమ కేసుల్లో చిక్కుకుని సరైన న్యాయం అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దళితులను గుర్తించి వారికి న్యాయ సహాయం అందించాలని సూచించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆదివారం బీజేపీ ఎస్సీ మోర్చా లీగల్‌ సెల్‌ రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్‌ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా నూకల మధుకర్‌ హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా విజయవాడ బార్‌ కౌన్సిల్‌ సభ్యులు, పార్టీ కార్యాలయ ఇన్‌చార్జి ఉప్పాలపాటి శ్రీనివాసరాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్‌ బాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూకల మధుకర్‌ మాట్లాడుతూ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తన జీవితంలో ఎన్నో అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నప్పటికీ వాటికి వెరవకుండా తన జీవితాన్ని తాను కోరుకున్న రీతిలో మలుచుకుని దేశానికి మార్గదర్శకమైన రాజ్యాంగాన్ని అందించారని గుర్తుచేశారు. దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని సూచించారు. రాజ్యాంగ హక్కులను సద్వినియోగం చేసుకుని వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. బహిరంగ వేదికలపై కుల వివక్షకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న కొందరు, ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. మాటలకు, చేతలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తొలగించి అంబేద్కర్‌ ఆలోచనా విధానాన్ని సమాజంలో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పనతల సురేష్‌ మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ నాయకత్వంలో అన్ని మోర్చాలకు ప్రాధాన్యత ఇస్తూ పార్టీ కార్యక్రమాలను బలోపేతం చేస్తున్నారని తెలిపారు. ఎస్సీ మోర్చాకు అనుబంధంగా లీగల్‌ సెల్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రస్థాయి కన్వీనర్‌గా డాక్టర్‌ అశోక్‌ను నియమించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్సీ మోర్చా లీగల్‌ సెల్‌ కన్వీనర్లు సమావేశంలో పాల్గొన్నారు. దళితులు ఎదుర్కొంటున్న సామాజిక, న్యాయపరమైన సమస్యలను గుర్తించి వారికి అండగా నిలవాలని, న్యాయ సహాయం అందించి మెరుగైన జీవితానికి బాటలు వేయాలని కోరారు. సమావేశంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేష్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వుల్లూరి గంగాధర్‌, జోనల్‌ ఇన్‌చార్జి మేకల లక్ష్మణ్‌, జిల్లా అధ్యక్షుడు సర్వశుద్ధి రాజు, పార్టీ లీగల్‌ సెల్‌ సభ్యుడు చె. ఉమామహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’

Original source: hmtvlive.com
Read more on Kaizer News