భారత్, అమెరికా దేశాల మధ్య సైనిక సహకారం సరికొత్త శిఖరాలకు చేరుతోంది. రాజస్థాన్‌లోని బికనేర్ జిల్లాలో ఉన్న మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వేదికగా జరుగుతున్న ద్వైపాక్షిక సైనిక విన్యాసాలు 'యుద్ధ అభ్యాస్ 2026'లో ఇరు దేశాల బలగాలు తమ సమర ప్రతాపాన్ని చాటుతున్నాయి. శత్రువుల లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించే M777 ఆల్ట్రా లైట్ హోవిట్జర్ (ULH) తుపాకీలతో ఫైరింగ్ డెమోతో ఎడారి సరిహద్దులు హోరెత్తిపోయాయి. భారత్, యూఎస్ ఆర్మీ సైనికులు సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడుల ప్రత్యక్ష ప్రదర్శన ఇరు దేశాల రక్షణ భాగస్వామ్య బలాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. లక్ష్యం ఏదైనా ముక్కలు కావాల్సిందే: M777 తుపాకుల ప్రతాపం రాజస్థాన్ ఎడారి తీవ్ర వేడిలో భారత ఫిరంగి దళం నిప్పులు చెరిగే ప్రదర్శనతో ఆకట్టుకుంది. M777తుపాకీలతో భారత ఫిరంగి సైనికులు చూపిన క్విక్ రియాక్షన్, ప్రొఫెషనలిజం, వ్యూహాత్మక దాడి తీరు యూఎస్ మిలిటరీ ప్రతినిధులను విశేషంగా ఆకట్టుకుంది. దాడులు జరిపిన వెంటనే స్థానాలను మార్చే 'షూట్ అండ్ స్కూట్' డ్రిల్స్, ఎదురు కాల్పుల నుంచి తప్పుకునే స్థావరాల కదలికలు, ఆయుధాల మోహరింపు వంటి వ్యూహాత్మక అంశాల్లో ఇరు దేశాల సైనికులు తమ అనుభవాలను పరస్పరం పంచుకున్నారు. 46 లక్షల రూపాయల జాబ్ వదిలేసి.. ఆర్మీ యూనిఫామ్ కోసం కుర్రాడి పోరాటం! పర్వత, ఎడారి ప్రాంతాల్లో 'ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్' బల ప్రదర్శన ఈ 'యుద్ధ అభ్యాస్ 2026' విన్యాసాలు సెప్టెంబర్ 15న ప్రారంభమై రెండు వారాల పాటు సుదీర్ఘంగా సాగనున్నాయి. ఉత్తరాఖండ్‌లోని ఔలీ కఠిన పర్వత శ్రేణులతో పాటు, రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో ఏకకాలంలో ఇరు దేశాల సైన్యాలు ప్రతిష్టాత్మక శిక్షణ పొందుతున్నాయి. ఇరు వైపులా కలిపి సుమారు 1200 మందికి పైగా యోధులు పాల్గొంటున్న ఈ డ్రిల్‌లో కొండ ప్రాంతాలు, ఎడారి సరిహద్దుల్లో ఉమ్మడి దాడులకు ఉపయోగించే 'ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్' వ్యూహాలపై ప్రధానంగా దృష్టి సేకరించారు. Viral video: భారత ఆర్మీ అధికారికి సెల్యూట్ కొట్టిన పాకిస్థాన్ జవాన్ కేవలం సాంప్రదాయ యుద్ధ తంత్రాలే కాకుండా, ఈసారి సమర విన్యాసాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి పెద్దపీట వేశారు. నిఘా, శత్రు స్థావరాల గుర్తింపు కోసం అత్యాధునిక డ్రోన్లు, ఏఐ ఆధారిత అటోనామస్ సిస్టమ్స్, సమకాలీన ఆయుధ వ్యవస్థలను పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రెండు దేశాల సైన్యాలు అత్యంత శీఘ్రంగా, సమన్వయంతో స్పందించేలా సమగ్ర ప్రణాళికలను రూపొందించి ఆచరణలో పెడుతున్నారు