Kaizer News

Gudihathnoor: నానో యూరియా, డీఏపీతో పత్తిలో అధిక ది

Gudihathnoor: నానో యూరియా, డీఏపీతో పత్తిలో అధిక దిగుబడులు!

· State - Telangana · hmtvlive.com

Shorts ​గుడిహత్నూర్: గుడిహత్నూర్ మండలం తోషం రైతు వేదిక వద్ద ‘ఆత్మ’ ఆధ్వర్యంలో క్లస్టర్ పరిధిలోని సేంద్రియ రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, అధిక సాంద్రత పత్తిలో నానో యూరియా, నానో డి.ఎ.పి పిచికారీతో దిగుబడి పెరిగి పెట్టుబడి ఖర్చు తగ్గుతుందని సూచించారు. మండల వ్యవసాయ అధికారి భగత్ రమేష్ మాట్లాడుతూ, పత్తిలో రసం పీల్చే పురుగుల నివారణకు జిగురు అట్టలు, వేపనూనె, కాయకుళ్ళు నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ మరియు గులాబీ రంగు పురుగు కోసం లింగాకర్షక బుట్టలు వాడాలని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి వెంకటి, కృషి సఖి యోగిత, రైతులు రమేష్, శ్రీకాంత్, అజీమ్ ఖాన్, సతీష్, రవీందర్, ధన్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News