ఎర్రవల్లిలో ఎస్సీ రైతులకు నోటీసులు జారీ.. తొలిరోజు 120 మందికి! 2 రోజుల్లో భూఆధారాలు చూపాలని హుకూం భూమి గుంజుకుంటారని దళితుల్లో భయం 243 మంది భూమిని 800 మందికి పంచే కుట్ర ఆయన ఎలాంటి అన్యాయం చేయలేదని వెల్లడి ఇంచు భూమి కూడా తీసుకోలేదని స్పష్టీకరణ రేవంత్ చెప్పేవన్నీ అబద్ధాలేనని మండిపాటు సర్వేలోనూ ఆక్రమణ లేదని తేల్చిన అధికారులు ఫామ్‌హౌస్‌లో ప్రభుత్వ భూమి లేదని తేలడం, కేసీఆర్‌కు దళితుల మద్దతుపై సీఎం ఫ్రస్ట్రేషన్ రైతులపై కక్ష.. భూమి లాక్కునేందుకు కుట్రలు నోటీసులిచ్చి మళ్లీ భూ పంపకానికి నిర్ణయం అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసిన ముఖ్యమంత్రి ‘ఎర్రవల్లిలోని 325 సర్వే నెంబర్‌లో ఉన్న 388 ఎకరాల ప్రభుత్వ భూమిని కేసీఆర్ తన ఆధీనంలో ఉంచుకున్నారు. వెంటనే సర్వే చేసి కబ్జా సంగతి 30 రోజుల్లో తేల్చాలని అధికారులను ఆదేశిస్తున్నా. ఈ భూమిని ప్రభుత్వం తీసుకొని ఒక్కొక్కరికి అర ఎకరం చొప్పున 800 మంది దళితులకు పంపిణీ చేస్తా. ఇక్కడే పట్టాలు పంపిణీ చేస్తా’ – అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన ఇది. మూడు రోజులుగా సిద్దిపేట జిల్లా రెవెన్యూ అధికారులు ఎర్రవల్లి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రాత్రీపగలు తేడా లేకుండా, 325 సర్వేనంబర్‌లో సర్వే చేస్తున్నారు. సీఎం రేవంత్ ఆరోపించినట్టుగా కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి, 325 సర్వే నంబర్‌లోని అసైన్డ్ భూమికి సంబంధమే లేదని తేల్చారు. అసెంబ్లీ సాక్షిగా ఘీంకారాలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి నవ్వులపాలయ్యే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): అప్పుడెప్పుడో 1980లో ఇందిరమ్మ కాలంలో దళితులకు భూములు ఇచ్చినప్పటికీ నాలుగు దశాబ్దాలపాటు అవి గడ్డి భూములుగానే మిగిలిపోయాయి. ఆ భూములను దళితులు చూసుకొని మురవటమే తప్ప పైసా ఆమ్దానీ పొందలేదు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాకే రాళ్లురప్పలతో నిండిన భూమిని సాగుయోగ్యంగా మార్చారు. తన వ్యవసాయ క్షేత్రం పక్కనే ఉన్న దళితుల దయనీయ స్థితిని చూసి వారికి బతుకునిచ్చే ఉద్దేశంతో ఆ భూములను కేసీఆర్ సిరుల మాగాణంగా కొత్త రూపునిచ్చారు. రాజకీయంగా కేసీఆర్‌పై కక్షతో రగిలిపోతున్న కాంగ్రెస్ సర్కారు, దళితుల భూములను కేసీఆర్ కబ్జా చేశారని అసెంబ్లీ సాక్షిగా ఆరోపించింది. సీఎం రేవంత్ సభలో ప్రటించిన 325 సర్వేనంబర్‌లో అసలు కేసీఆర్‌కు ఇంచు భూమి కూడా లేదని తేలడంతో సర్కారు పరువుపోయింది. ఎర్రవల్లి దళిత రైతులు ప్రభుత్వానికే మద్దతుగా ఉంటారని, కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతారని, వాళ్లను అడ్డం పెట్టుకొని బీఆర్‌ఎస్ అధినేతను మరింత ఇరకాటంలోకి నెట్టొచ్చని రేవంత్‌రెడ్డి భావించారు. కానీ ఇది కూడా అడ్డం తిరిగింది. దీంతో తన వైఫల్యాన్ని కప్పిపుచ్చకోవడానికి ఎర్రవల్లి దళిత రైతులపైకి సర్కారు దండెత్తింది. అసైన్డ్ భూములుగా దళితులకు హక్కున్నప్పటికీ, వాటిని గైరాన్ ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ అవి మీ కబ్జాలో ఎందుకున్నాయి? మీకెలాంటి హక్కులున్నాయో చెప్పాలని నోటీసులు ఇచ్చింది. అసెంబ్లీ సాక్షిగా సీఎం ప్రకటించినట్టుగా డపుపకొట్టిన 800 మంది రైతులకు అరెకరం చొప్పున ఎర్రవల్లి దళితుల భూములను పంచుతానని చెప్పి వారిలో గుబులు పుట్టించారు. మరోవైపు ఈ వివాదం చాలద