Kaizer News

రేవంత్‌ సర్కారు ‘ఈవీ’ జోష్‌..!

రేవంత్‌ సర్కారు ‘ఈవీ’ జోష్‌..!

· State - Telangana · prabhanews.com

వినియోగదారులకు చేయూత.. పాలసీకి మరిన్ని మెరుగులు.. వర్గాల వారీగా సబ్సిడీలు, రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రభుత్వోద్యోగులకు 20 శాతం రాయితీతో ప్రత్యేక పథకం ఆటో కార్మికులకు రూ.1.50 లక్షల చొప్పున సబ్సిడీ ప్రైవేట్‌ వర్గాలకు, చిరు వ్యాపారులకు మరో విధానం ప్రభుత్వ రంగంలో అన్ని స్థాయిల్లో అధికారులకు ఈవీ వాహనాలు దేశానికే ఆదర్శంగా తెలంగాణ ఈవీ పాలసీ రూపకల్పన కేంద్ర ప్రభుత్వ జాతీయ ఈవీ విధానంతో అనుసంధానం రాయితీల అదనపు వ్యయం భారమంతా రాష్ట్ర సర్కారుదే.. కాలుష్య ప్రభావిత సమస్యల నుంచి గ-్టట-క్కే వ్యూహంతో కార్యాచరణ వచ్చే అసెంబ్లీ వేదికగా ప్రకటించనున్న రేవంత్‌ సర్కారు హైదరాబాద్‌, ఆంధ్రప్రభ పొలిటికల్‌ బ్యూరో : ఆర్థికంగా, భౌగోళికంగా శరవేగంగా విస్తరిస్తున్న రాజధాని హైదరాబాద్‌ మహానగరంతో పాటు వరంగల్‌, కరీంనగర్‌ లాంటి ద్వితీయశ్రేణి నగరాల్లో మితిమీరుతున్న ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు రేవంత్‌ రెడ్డి సర్కారు వ్యూహాత్మక కసరత్తు మొదలుపెట్టింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈవీ పాలసీకి మరిన్ని మెరుగులు దిద్ది వర్గాల వారీగా సబ్సిడీలు, రాయితీలతో ప్రోత్సాహకాలు అందించాలని భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు 20 శాతం ప్రత్యేక రాయితీతో కొత్త పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. అలాగే, రాజధాని పరిధిలోని ఆటో కార్మికులకు రూ.1.50 లక్షల చొప్పున సబ్సిడీ ఇస్తూ ఇప్పుడున్న ఆటోలను ఈవీ రూపంలోకి మార్చాలన్న నిర్ణయాన్ని తక్షణ కార్యాచరణగా అమలు చేయబోతోంది. క్రమక్రమంగా ప్రైవేట్‌ వర్గాలకు, చిరు వ్యాపారులకు మరో విధానంలో ఈవీ వాహనాలను అందిచేలా చర్యలకు ఆదేశించింది. ప్రభుత్వ రంగంలో అన్ని స్థాయిల్లో అధికారులకు ఈవీ వాహనాలను సమకూర్చడం ద్వారా నెలనెలా ఇంధన వ్యయాన్ని భారీగా తగ్గించడంతో పాటు కాలుష్యరహిత నగరాన్ని ఆవిష్కరించే క్రమంలో ఆదర్శంగా నిలిపేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో దేశానికే ఆదర్శంగా ‘తెలంగాణ ఈవీ పాలసీ’ రూపకల్పన చేసి నిర్ధిష్టంగా అమలు చేయాలని గడిచిన మంత్రిమండలిలోనే నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పాలసీకి కేంద్ర ప్రభుత్వ జాతీయ ఈవీ విధానంతో అనుసంధానం చేస్తూ.. రాయితీల అదనపు వ్యయం భారమంతా రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. మితిమీరుతున్న కాలుష్య ప్రభావిత సమస్యల నుంచి గట్టెక్కించే వ్యూహంతో కార్యాచరణ సిద్ధమవుతోంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల వేదికగా రేవంత్‌ సర్కారు కొత్త ఈవీ పాలసీని ప్రకటించనున్నట్లు అధికార వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశ రాజధాని కాలుష్యం కొరల్లో చిక్కుకుని పరిష్కారం సాధ్యంకాని సమస్యలతో సవాళ్లు విసురుతున్న సందర్భాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తమవుతోంది. ఢిల్లీ నగరం ఎదుర్కొంటున్న కాలుష్య ప్రభావం ఇక్కడ తలెత్తకుండా ఉండాలంటే, ఫ్యూయల్‌ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్‌ వాహనాలను తీసుకురావాల్సిన అవశ్యకతను గుర్తించారు. ఇందులో భాగంగానే.. ఆటో రిక్షాలు, ట్యాక్సీలు, చిన్న కమర్షియల్‌ వాహనాలను మాత్రమే కాకుండా సీఎన్‌జీతో నడిచే వాహనాల సంఖ్యను భారీగా తగ్గించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణా కోసం కూడా

Original source: prabhanews.com
Read more on Kaizer News