Kaizer News

ENG vs PAK | లార్డ్స్‌లో అబ్బాస్ పాంచ్ పటాకా.. పాక

ENG vs PAK | లార్డ్స్‌లో అబ్బాస్ పాంచ్ పటాకా.. పాకిస్థాన్ బ్యాటర్లు అద్భుతం చేసేనా..!

· Sports · ntnews.com

ENG vs PAK : లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఆలౌటైంది. పాకిస్థాన్ పేసర్ మొహమ్మద్ అబ్బాస్‌(5-57) ఐదు వికెట్లతో చెలరేగగా.. ఆతిథ్య జట్టు నాలుగోరోజు తొలి సెషన్‌లోనే కుప్పకూలింది. డాన్ లారెన్స్‌(54) అర్ధ శతకంతో, హ్యారీ బ్రూక్‌(34) మాత్రమే రాణించారు. పాకిస్థాన్‌కు 389 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన జో రూట్ సేన.. సిరీస్‌ను వైట్‌వాష్ చేయాలనే పట్టుదలతో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో చేతులెత్తేసిన పాక్ బ్యాటర్లు.. పటిష్టమైన పేస్ దళాన్ని ఎదుర్కొని ఓటమిని తప్పిస్తారా? అనేది ఆసక్తి రేపుతోంది. రసవత్తరంగా సాగుతున్న లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ ఆలౌటైంది. నాలుగో రోజు జహీర్ అబ్బాస్‌(5-57) విజృంభణతో లోయర్ ఆర్డర్ తోకముడవగా ఆతిథ్య జట్టు 208 పరుగులకే ఆలౌటైంది. ఓలీ రాబిన్సన్‌(8)ను పెవిలియన్ పంపిన అబ్బాస్ లార్డ్స్‌లో ఐదువికెట్ల ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగుల ఆధిక్యంతో ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌ను పాక్ పేసర్లు అద్భుతంగా కట్టడి చేశారు. అబ్బాస్, ఖుర్రం, మొహమ్మద్ అలీ()లు వరసగా వికెట్లు తీసి పాక్‌ను పోటీలోకి తెచ్చారు. అయితే.. హ్యారీ బ్రూక్‌(34), డాన్ లారెన్స్‌(54)లు పట్టుదలగా ఆడారు. పునరాగమనం సిరీస్‌లో ఆకట్టుకున్న లారెన్స్ అర్ధ శతకంతో ఇంగ్లండ్ ఆధిక్యాన్ని పెంచుతూ పోయాడు. క్రీజులో పాతుకుపోయిన అతడిని బౌల్డ్ చేసిన అబ్బాస్ ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. చివరి బ్యాటరైన ఓలీ రాబిన్సన్‌(8) వికెట్టూ తీసి.. లార్డ్స్‌తో చిరస్మరణీయ ప్రదర్శనతో రికార్డు సాధించాడీ పాక్ పేసర్. 389 పరుగుల ఛేదనలో పాక్ బ్యాటర్లు నిలబడడంపై ఆ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి

Original source: ntnews.com
Read more on Kaizer News