Kaizer News

బ్రహ్మంగారి గుడిలో పనులు చేస్తుండగా ఏదో అలికిడి.. చండప్రచండ స్వరూపంతో లభ్యమైన..

· State - Telangana · tv9telugu.com

తిరుపతి జిల్లా చంద్రగిరిలోని బ్రహ్మంగారి గుడి సమీపంలో తవ్వకాలు జరుపుతుండగా అరుదైన అపరకాళి విగ్రహం వెలుగుచూసింది. ఆరు భుజాలు, ఆరు ఆయుధాలతో చండప్రచండ స్వరూపంలో ఉన్న అమ్మవారి విగ్రహం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. రాక్షసుడిని కాళ్ల కింద తొక్కుతూ వధిస్తున్నట్లుగా విగ్రహ రూపం ఉంది. విగ్రహం లోహం, కాలం వంటి వివరాలను నిర్ధారించేందుకు పురావస్తుశాఖ అధికారులు పరిశీలనలు చేస్తున్నారు. విషయం తెలియడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని పూజలు చేస్తున్నారు

Original source: tv9telugu.com
Read more on Kaizer News