Kaizer News

Markapur: కొలబిమునిపాడులో రీ-సర్వే ప్రారంభం: తహసీల

Markapur: కొలబిమునిపాడులో రీ-సర్వే ప్రారంభం: తహసీల్దార్ చిరంజీవి

· State - Telangana · hmtvlive.com

Shorts మార్కాపురం జిల్లా: మార్కాపురం మండలం కొలబిమునిపాడులో రీ-సర్వే కార్యక్రమాన్ని తహసీల్దార్ చిరంజీవి ప్రారంభించారు. ముందుగా గ్రామసభ నిర్వహించి, అనంతరం గ్రామంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. రైతులు, గ్రామస్థులతో కలిసి తహసీల్దార్ చిరంజీవి టెంకాయ కొట్టి రీ-సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ చిరంజీవి మాట్లాడుతూ.. రీ-సర్వే ప్రక్రియలో ఎలాంటి తప్పులు దొర్లకుండా రెవెన్యూ సిబ్బందికి రైతులు, గ్రామస్థులు సహకరించాలని కోరారు. రీ-సర్వే పూర్తయిన అనంతరం అర్హులైన ప్రతి రైతుకు నూతన రైతు పాస్‌బుక్కులు మంజూరు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఐ, సర్వేయర్ సంజీవ రాజు, రెవెన్యూ సిబ్బంది, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News