కడెం, ఆంధ్రప్రభ: కడెం మండలంలోని కొత్త మద్దిపడిగ గ్రామానికి చెందిన గర్భిణి నాదర్కా వనితకు పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన 108 సిబ్బంది ఈఎంటి కె సేవ, పైలట్ రాకేశ్‌లు గ్రామానికి చేరుకొని అంబులెన్స్‌లో ఖానాపూర్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో అంబులెన్స్‌లోనే ప్రసవించింది. ఆమె పాపకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డను ఖానాపూర్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వైద్యం కోసం తరలించారు. వారి వెంట కొత్తమద్దిపడగ ఆశ వర్కర్ స్వర్ణలత ఉన్నారు