Kaizer News

AP: 35వ రోజు విజయవంతంగా ‘ఇంటింటికీ తెలుగుదేశం–2026

AP: 35వ రోజు విజయవంతంగా ‘ఇంటింటికీ తెలుగుదేశం–2026..94.22 లక్షల ఇళ్లకు చేరుకున్న టీడీపీ!

· State - Telangana · hmtvlive.com

AP: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు, ప్రభుత్వ పనితీరుపై ప్రజల స్పందనను నేరుగా తెలుసుకునే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ‘ఇంటింటికీ తెలుగుదేశం–2026’ కార్యక్రమం 35వ రోజు రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగింది. ‘రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం’ అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇంటింటికీ వెళ్లి ప్రజలను నేరుగా కలిశారు. ఒక్కరోజులోనే 1,78,567 ఇళ్లను సందర్శించారు. దీంతో కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 94.22 లక్షల ఇళ్లకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నట్లు పార్టీ వెల్లడించింది. ప్రతి గడపను పలకరిస్తూ ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజలకు వివరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వివిధ వర్గాల కోసం తీసుకుంటున్న అభివృద్ధి చర్యలను ప్రజలకు వివరించడంతో పాటు.. ఆయా పథకాల ద్వారా కుటుంబాలకు కలిగిన ప్రయోజనాలను కూడా తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, యువత, పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇదే సమయంలో కేవలం ప్రభుత్వ పథకాలను వివరించడానికే పరిమితం కాకుండా.. ప్రజల సమస్యలు, స్థానిక అవసరాలు, ప్రభుత్వ సేవలపై వారి అభిప్రాయాలను కూడా టీడీపీ శ్రేణులు నేరుగా సేకరిస్తున్నాయి. ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను సంబంధిత నాయకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. దీంతో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు మధ్య మరింత ప్రత్యక్ష అనుసంధానంగా మారుతోంది. రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి కుటుంబాన్ని కలుసుకుని ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై వివరాలు అందిస్తూ.. ప్రజల నుంచి వస్తున్న స్పందనను నమోదు చేస్తున్నారు. గతంలో అమలైన పథకాలు, ప్రస్తుతం అందుతున్న ప్రయోజనాలు, భవిష్యత్‌లో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయాలను నేరుగా తెలుసుకోవడం ఈ కార్యక్రమంలో మరో కీలక అంశంగా పార్టీ పేర్కొంది. ప్రజల నుంచి వచ్చిన సూచనలు, సమస్యలను పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి.. అవసరమైన చోట పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించే ప్రయత్నంగా ఈ కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులు ముందుకు తీసుకెళ్తున్నాయి. 35 రోజులు పూర్తయినా కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన కొనసాగుతుండటంతో టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నెలకొంది. పార్టీ శ్రేణులతో పాటు పలుచోట్ల సాధారణ ప్రజలు కూడా స్వచ్ఛందంగా భాగస్వామ్యం అవుతున్నారని టీడీపీ తెలిపింది. ఇప్పటివరకు 94.22 లక్షల ఇళ్లను సందర్శించడం, ఒక్కరోజులో 1,78,567 ఇళ్లను

Original source: hmtvlive.com
Read more on Kaizer News