Job Loss Benefit: ఈ రోజుల్లో ఎప్పుడు ఏమవుతుందో ఊహించడం చాలా కష్టంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు, ఆర్థిక పరిస్థితుల వల్ల ఎంతోమంది ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో ఉద్యోగం పోయినవారిని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఓ అద్భుతమైన పథకం ప్రవేశపెట్టింది. అదే ఈఎస్‌ఐసీ (ESIC) అందిస్తున్న 'అటల్ బీమిత్ వ్యక్తి కల్యాణ్ యోజన' (ABVKY). ఈ పథకం కింద ఉద్యోగం ఊడిపోతే జీవితంలో ఒక్కసారి, ఏకంగా 90 రోజుల పాటు (3 నెలలు) మీ చివరి జీతంలో 50 శాతం మొత్తాన్ని నిరుద్యోగ భత్యంగా పొందవచ్చు. ఇటీవల లోక్‌సభలో కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఈ పథకం మాట్లాడుతూ.. ఈ పథకానికి విశేష ఆదరణ లభిస్తున్నందున దీని కాలపరిమితిని 2026 జూలై 1 నుంచి 2027 జూన్ 30 వరకు పొడిగించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. అంతేకాకుండా క్లెయిమ్‌లు త్వరగా సెటిల్ అయ్యేలా అనేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు