Kaizer News

Husnabad: నాగారం గ్రామంలో 'సురక్షా నేత్ర' 12 సీసీ

Husnabad: నాగారం గ్రామంలో 'సురక్షా నేత్ర' 12 సీసీ కెమెరాలు ప్రారంభం!

· State - Telangana · hmtvlive.com

Shorts హుస్నాబాద్: సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని హుస్నాబాద్ మండలం నాగారం గ్రామంలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ IPS మేడం చొరవతో ప్రారంభించిన “ సిద్దిపేట్ సురక్షా నేత్ర” కార్యక్రమంలో భాగంగా 12 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏసీపీ శ్రీ సదానందం మరియు సీఐ శ్రీధర్ హాజరై సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గ్రామంలో నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల నివారణ, నేరస్తుల కదలికలపై నిఘా మరియు ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడంలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలను పర్యవేక్షించడంతో పాటు, నేరాలు జరిగిన సందర్భంలో దర్యాప్తుకు అవసరమైన ఆధారాలను సేకరించడంలో కూడా ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు మరియు సంబంధిత సిబ్బందిని అధికారులు అభినందించారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News