Kaizer News

Kesamudram: కేసముద్రంలో 150 మంది విద్యార్థినులకు స

Kesamudram: కేసముద్రంలో 150 మంది విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ!

· National - India · hmtvlive.com

Shorts మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణ లో మండలం లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 150 మంది విద్యార్థినిలకు గెయిల్ సహకారం ( సి.ఎస్.ఆర్ నిధులు ) తో సైకిళ్ళ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ......ప్రధాని నరేంద్ర మోధీ ఇచ్చిన అవకాశంతో ఈ ప్రాంత వాసులకు సహాయ సహకారాలను అందిస్తున్నానని , అంబులెన్స్ లు , రైతులకు పవర్ స్ప్రేయర్లు , విద్యార్థులకు ల్యాప్ టాప్ లు , సైకిళ్ళ , మహిళలకు కుట్టుమిషన్లను పంపిణీ చేస్తున్నానన్నారు. మేము చదువుకునే కాలంలో మండల కేంద్రాల్లోనే హైస్కూల్స్ ఉండేవని , నాలుగు , ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్లి చదువుకునే వాళ్ళమని , ప్రభుత్వ హాస్టల్ల లో ఉండి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని ఈ స్థాయికి ఎదిగానని తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కొద్దిగా తక్కువ ఉన్నా... ఉన్నత చదువులు చదివిన వారు ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారని , ప్రైవేట్ పాఠశాలలు పైకి అట్టహాసంగా కనిపించిన చదువు అంతంత మాత్రమే ఉంటుందని , అందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఉన్నత స్థానాల్లో స్థిరపడాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు , ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News