Shorts Madanapalle: ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ జన్మదినం సందర్భంగా, ముఖ్యమంత్రి మరియు ప్రధానమంత్రి హోదాల్లో ప్రభుత్వాధినేతగా 25 సంవత్సరాల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా యువ మోర్చా (BJYM) ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక బైక్ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి వారణాసికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బీజేపీ యువ నాయకుడు మిట్టా వంశీకృష్ణ ఘన స్వాగతం పలికారు. ఆయనతో పాటు అన్నమయ్య జిల్లా బీజేపీ యువ మోర్చా నాయకులు సింహం శ్రీకాంత్, టీచర్ల తదితరులు పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మస్థలమైన గుజరాత్‌లోని వడ్నగర్ నుంచి ఆయన కర్మభూమిగా భావించే వారణాసి వరకు నిర్వహించిన ప్రత్యేక బైక్ యాత్ర కార్యక్రమంలో భాగస్వామి కావడం సంతోషంగా ఉందని మిట్టా వంశీకృష్ణ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజాసేవను పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం యువతలో దేశభక్తి, సేవాభావాన్ని పెంపొందించేలా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ యువమోర్చా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు