Shorts కర్నూలు: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్ ల ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు. శనివారం కల్లూరు మండలం ఏ.గోకులపాడు గ్రామంలోని శిరోమణి ఇంటి పై పీఎం సూర్యఘర్ పథకం ULA మోడల్ కింద, శ్రీనివాస్ రెడ్డి ఇంటి పై capex మోడల్ కింద ఏర్పాటు చేసిన సోలార్ రూఫ్ టాప్ ను పరిశీలించి, లబ్దిదారులతో కలెక్టర్ మాట్లాడారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఎస్సీ,ఎస్టీ లబ్ధిదారులకు 23077 ULA మోడల్ సోలార్ రూఫ్ టాప్ లు ఉచితంగా ఏర్పాటు చేసేందుకు లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో 17331 రూఫ్ టాప్ లను ఏర్పాటు చేసి 75 శాతం లక్ష్యాన్ని సాధించామని, మిగిలిన 25 శాతం లక్ష్యం కూడా త్వరితగతిన సాధించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు..ఈ వ్యయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే capex మోడల్ కింద సోలార్ రూఫ్ టాప్ ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా ₹78,000 వరకు సబ్సిడీని అందిస్తోందని, జిల్లాలో ఈ మోడల్ కింద 4300 సోలార్ రూఫ్ టాప్ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో 3869 మంది లబ్ధిదారులకు రూ.29 కోట్లు సబ్సిడీ అందించినట్లు కలెక్టర్ తెలిపారు. దశల వారీగా లబ్ధిదారులందరికీ సబ్సిడీ మొత్తం అందుతుందని కలెక్టర్ తెలిపారు. లబ్ధిదారు శిరోమణి ఇంటి పై పీఎం సూర్యఘర్ పథకం ULA మోడల్ కింద ఏర్పాటు చేసిన సోలార్ రూఫ్ టాప్ ను కలెక్టర్ పరిశీలిస్తూ.. ఈ గ్రామంలో ఎన్ని కుటుంబాలకు ఏర్పాటు చేశారని అధికారులను ఆరా తీశారు. 87 రూఫ్ టాప్ లను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఇంకా సౌర ప్యానెల్స్ ఏర్పాటుకు అనువైన ఇళ్లను గుర్తించి, ఏర్పాటు చేయాలని కలెక్టర్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుడు శ్రీనివాస్ రెడ్డి ఇంటి పై capex మోడల్ కింద ఏర్పాటు చేసిన సోలార్ రూఫ్ టాప్ ను కలెక్టర్ పరిశీలిస్తున్న సమయంలో CAPEX మోడల్‌తో విద్యుత్ బిల్లుల భారం బాగా తగ్గిందని లబ్ధిదారులు కలెక్టర్ కి వివరించారు.. సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుతో అధిక విద్యుత్ బిల్లులు వస్తున్న కుటుంబాలకు విద్యుత్ బిల్లు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.. ఈ విధంగా కలుగుతున్న లబ్ధి గురించి ప్రజలకు అవగాహన కల్పించి ఎక్కువ మంది సోలార్ రూఫ్ టాప్ లను ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.. కర్నూలు నగరంలోని బి క్యాంప్ లో ఉన్న 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి క్యాంప్ లో ఉన్న 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలో విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థ, తదితర అంశాలను విద్యుత్ శాఖ అధికారులు కలెక్టర్ కు ప్రాక్టికల్‌గా వివరించారు. సంబంధిత సబ్‌స్టేషన్ నుంచి అరోరా నగర్, మిలటరీ కాలనీ, బి-క్యాంప్, సి-క్యాంప్, గాయత్రీ ఎస్టేట్ తదితర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా జరుగుతుందని, సబ్‌స్టేషన్‌లో విజ్ఞాన మందిరం, హౌసింగ్ బోర్డు, అరోరా నగర్ తదితర ప్రాంతాలకు సంబంధించిన 11 కేవీ ఫీడర్ల