Kaizer News

యువతే లక్ష్యంగా గంజాయి దందా... సిద్దిపేట, గద్వాల జ

యువతే లక్ష్యంగా గంజాయి దందా... సిద్దిపేట, గద్వాల జిల్లాల్లో ఆగని విక్రయాలు

· State - Telangana · v6velugu.com

సిద్దిపేట/గద్వాల, వెలుగు : సిద్దిపేట, గద్వాల జిల్లా ల్లో పలు చోట్ల గంజాయి విక్రయాలు గుట్టుగా సాగుతున్నాయి. అక్రమార్జనకు అలవాటు పడిన వారు ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి తెచ్చి, చిన్న చిన్న ప్యాకెట్లలో నింపి యువత, మైనర్లే లక్ష్యంగా చేసుకుని అమ్ముతున్నారు. ఒకవైపు గంజాయి అమ్మకాలపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నా చాప కింద నీరులా సాగుతూనే ఉంది. సిద్దిపేట జిల్లా కేంద్రంలో నెల రోజుల వ్యవధిలో గంజాయి అమ్ముతూ ఓ బాలుడు పట్టుబడగా, మరో ఐదుగురు యువకులు గంజాయి సేవిస్తుండగా పోలీసులు పట్టుకుని వారి నుంచి 600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి ఇంట్లో గంజాయి మొక్కలను పెంచుతూ పట్టుబడగా, చేర్యాలలో ఒక పాన్ షాప్ లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకులు, మైనర్లనే లక్ష్యంగా చేసుకుని రహస్య అడ్డాలు, రద్దీ లేని ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు గంజాయి సేవించడంతో పాటు అమ్మకాలకు పాల్పడుతున్న ఉదంతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల సిద్దిపేటలో గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ వారిలో ఇతర రాష్ట్రానికి చెందిన యువకులు ఉండటం గమనార్హం. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన ఎండు గంజాయిని ప్యాకెట్లుగా తయారు చేసి అమ్ముతున్నారు. గంజాయికి అలవాటు పడ్డ యువకులతో వీటిని అమ్మేవారు ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ వారికి అందజేస్తున్నారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, చేర్యాల, హుస్నాబాద్‌లతో పాటు పలు మండల కేంద్రాలు, గ్రామాల్లో గంజాయి సిగరెట్లు, చాక్లెట్లు రహస్యంగా అమ్ముతున్నారు. గంజాయి అమ్మకాలపై జిల్లా పోలీసు యంత్రాంగం గట్టి నిఘా పెట్టినా ఎక్కడో ఒక చోట అమ్ముతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాలేజీలు, స్కూళ్లలో విద్యార్థులకు మత్తు పదార్థాల సేవనం వల్ల ఏర్పడే దుష్పరిణామాల గురించి అవగాహన కల్పించడంతో పాటు, వాటి అమ్మకాలకు అడ్డుకట్ట వేయడానికి పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కువగా విద్యార్థులు, యువకులు, మైనర్లు మత్తు పదార్థాల బారిన పడి వ్యసనపరులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో యువతను సరైన మార్గంలో మళ్లించడం కోసం సిద్దిపేట జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేకంగా ‘డీ అడిక్షన్ సెంటర్’ను ఏర్పాటు చేసి, మత్తుకు అలవాటు పడ్డ వారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా నడిగడ్డలో గంజాయి దందా జోరుగా సాగుతున్నది. ఏపీలోని కర్నూలు నుంచి, ఇటు కర్ణాటకలోని రాయచూరు నుంచి రెండు రాష్ట్రాల బార్డర్ దాటి జోగులాంబ గద్వాల జిల్లాలోకి గంజాయి వస్తున్నది. జిల్లాలోని కొందరు అక్కడక్కడ పంట పొలాల్లో గంజాయి సాగు చేస్తూ సరఫరా చేస్తున్నారు. ఇటీవలే మూడుసార్లు గంజాయి పట్టుబడింది. ఈనెల 8న అలంపూర్ నియోజకవర్గంలోని సుల్తానాపురంలో ఒక ఇంట్లో కేజీ 30 గ్రాముల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 10న అయిజ మండలం భూమిపురం గ్రామ శివారులో మోటార్ సైకిళ్లు తనిఖీ చేస్తుండగా 77 గ్రాముల గంజాయి పట్టుబడింది. గురువారం రాత్రి గద్వాల టౌన్ లో వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిని తనిఖీ చేయగా కొంత గంజాయి లభ్యమైంది. గద్వాల జిల్లాలోకి అటు ఏపీలోని

Original source: v6velugu.com
Read more on Kaizer News