Kaizer News

Chennur: చెన్నూరులో వినాయక నిమజ్జనంపై పోలీసుల శాంత

Chennur: చెన్నూరులో వినాయక నిమజ్జనంపై పోలీసుల శాంతి కమిటీ భేటీ!

· State - Telangana · hmtvlive.com

Shorts Chennur: చెన్నూరు పట్టణంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులతో చెన్నూర్ పోలీసుల శాంతి కమిటీ సమావేశాన్ని పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించినారు. ఇట్టి సమావేశంలో చెన్నూర్ పట్టణ మరియు మండలాలలోనికి చెందిన సుమారు 200 మంది మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు. గణేష్ మండపాల నిర్వహణ, శోభయాత్ర, నిమజ్జన ఏర్పాట్లు, తదితర అంశాలపై నిర్వాహకులకు తగు జాగ్రత్తల గూర్చి సూచనలు చేసిన సీఐ మరియు ఎస్ ఐ లు. ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో గణేష్ శోభయాత్ర మరియు నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని కోరారు. గణేష్ మండపాల నిర్వహకులు, భక్తులు, స్థానిక ప్రజలు అందరూ పోలీసులకు సహకరించి వేడుకలను సజావుగా జరిగేలా చూడాలని సూచించారు. గత రెండు మూడు సంవంత్సరాలలో గణేష్ నిమజ్జనం ఉత్సవాల్లో ఘర్షణలకు పాల్పడిన వారిని మరియు రౌడీ షీటర్స్ ముందస్తు చర్యలలో భాగంగా బైండోవర్ చేసినట్టు వారి కదలికలపై నిఘా కూడా పెట్టినట్లు తెలిపారు. గణేష్ నిమజ్జన వేడుకల్లో డీజే లకు ఎలాంటి అనుమతి లేదని భక్తులు, స్థానిక ప్రజలు దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తిస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొనబడుతాయని తెలిపారు. రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మరియు ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మునిసిపల్ అధికారుల చొరవతో గణేష్ నిమజ్జన ఘాట్ వద్ద నిర్వాహకుల సౌకర్యార్థం కాంక్రీట్ తొ రోడ్డు నిర్మించినట్లు తెలిపారు. గణేష్ నిర్వాహకులు గత సంవత్సరం మాదిరిగానే పోలీస్ వారు సూచించిన రూట్ మ్యాప్ ఆధారంగా శోభయాత్ర కొనసాగుటకు అందరు సహకరించాలని కోరారు. గణేష్ నిమజ్జన కార్యక్రమం ఆలస్యం కాకుండా నిర్ణిత సమయంలో ప్రశాంతమైన వాతావరణంలో పూర్తి చేసి చెన్నూర్ కు మంచి పేరు వచ్చే విధంగా అందరు కృషి చేయాలనీ తెలిపారు. గణేష్ శోభయాత్ర సమయంలో హాస్పిటల్స్, స్కూల్స్, ఆలయాలు మరియు ప్రార్ధన మందిరాల సమీపంలో ఎటువంటి శబ్దాలు చేయకుండా ప్రతిఒక్కరు సహకరించాలని తెలిపినారు. గణేష్ నిమజ్జనం ఉత్సవాల్లో ఎవరైనా ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పని ఈ సందర్భంగా చెన్నూరు సిఐ బన్సీలాల్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ సిఐ బన్సీలాల్, ఎస్ ఐ లు రాజశేఖర్, శ్యాంపటేల్ మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News