Kaizer News

Kurnool: రేపు జరగబోయే NEET-PG పరీక్షకు పటిష్ట బందో

Kurnool: రేపు జరగబోయే NEET-PG పరీక్షకు పటిష్ట బందోబస్తు

· State - Telangana · hmtvlive.com

కర్నూలు: రేపు 30-08-2026 (ఆదివారం)న కర్నూలు జిల్లా వ్యాప్తంగా 7 పరీక్ష కేంద్రాలలో ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు NEET-PG పరీక్ష నిర్వహించనున్నట్లు కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ శనివారం తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 2,144 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. 1) ఐయాన్ డిజిటల్ జోన్ - కర్నూలు. (పూజ్య ఎడ్యుకేషనల్ సొసైటీ, డా. కె.వి. సుబ్బారెడ్డి స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్, దూపాడు, కల్లూరు మండలం) 2) డా.కె వి సుబ్బారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , దూపాడు రైల్వే స్టేషన్ - లక్ష్మీపురం పోస్ట్, 3) ఐయాన్ డిజిటల్ జోన్ - దూపాడు రైల్వే స్టేషన్ ఎదురుగా, లక్ష్మీపురం పోస్ట్, 4) జి. పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, నంద్యాల రోడ్ , కర్నూలు. 5) యునిడాడ్ టెక్నాలజీస్, సర్వీసెస్ నంద్యాల చెక్ పోస్టు, కర్నూలు. 6) భీమా ఇంజనీరింగ్ కాలేజ్, ఆలూరు రోడ్డు, ఆదోని. 7) సెయింట్ జాన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎర్రకోట, ఎమ్మిగనూరు. NEET-PG పరీక్షను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకునేలా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అన్ని నియమ నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా పరీక్ష రాసి తమ లక్ష్యాలను చేరుకోవాలని ఎస్పీ ఆకాంక్షించారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని ఎస్పీ తెలిపారు. పరీక్షా నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకుని , ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసి విజయవంతం కావాలని కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటల్ ఐపియస్ ఆకాంక్షించారు. నీట్ పరీక్షల (PG)-2026 నిర్వహణకు సంబంధించి కర్నూలు కలెక్టరేట్‌లో హెల్ప్ డెస్క్ / కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులకు ఏమైనా సలహాలు ఉంటే హెల్ప్ డెస్క్ ల్యాండ్‌లైన్ నంబర్: 08518 277305 ను సంప్రదించి, సందేహాలను నివృత్తి చేసుకోవచ్చన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News