Kaizer News

Kurnool: గూడూరులో రోడ్డు ప్రమాదం.. మృతదేహంతో రాస్త

Kurnool: గూడూరులో రోడ్డు ప్రమాదం.. మృతదేహంతో రాస్తారోకో, ఉద్రిక్తత!

· State - Telangana · hmtvlive.com

Kurnool: కర్నూలు జిల్లా గూడూరు లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.నిన్న కర్నూలు శివారు ప్రాంతంలో మోటార్ బైక్ ను, ట్రాక్టర్ ఢీకొంది.ఈ ఘటనలో ఎర్రన్న (40) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృతుడు ఎర్రన్న కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆయన బంధువులు, గ్రామస్థులు గూడూరు పాత బస్టాండ్ వద్దకు చేరుకిని మృతదేహంను అంబులెన్స్ ఉంచి రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతుడి కుటుంబానికి నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కర్నూలు-ఎమ్మిగనూరు ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News