Kaizer News

నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ షురూ.. ఇకపై..

నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ షురూ.. ఇకపై..

· State - Telangana · sakshi.com

నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్ 19న పశ్చిమ రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాలు వెనక్కి వెళ్లడం ప్రారంభించినట్లు ఐఎండీ ధ్రువీకరించింది. సాధారణంగా సెప్టెంబర్ 17న ఉపసంహరణ ప్రారంభం కావాల్సి ఉండగా, ఈసారి రెండు రోజులు ఆలస్యమైంది. వచ్చే 3-4 రోజుల్లో రాజస్థాన్, పంజాబ్, సౌరాష్ట్ర-కచ్‌లోని మరికొన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాలు మరింతగా వెనక్కి వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ తెలిపింది. రుతుపవనాలు వాయవ్య భారతదేశం నుంచి నిష్క్రమిస్తున్నప్పటికీ, బంగాళాఖాతంలోని వాతావరణ వ్యవస్థ బలపడటంతో దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగనున్నాయి. దీంతో సెప్టెంబర్ 20న దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు, ఉరుములు, బలమైన గాలుల పరిస్థితులను ప్రజలు గమనించాల్సి ఉంటుంది. దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాలతో పాటు అండమాన్‌-నికోబార్ దీవుల్లో సెప్టెంబర్ 20, ఆదివారం భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తీర ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణతో పాటు అండమాన్‌-నికోబార్ దీవుల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రాంతాల్లో పిడుగులు, ఉరుములతో కూడిన వర్షంతో పాటు గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పగటిపూట బలమైన ఉపరితల గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు రాజస్థాన్, గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, కొంకణ్‌-గోవా, మధ్యప్రదేశ్, ఉత్తర కర్ణాటక, తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో గాలులతో కూడిన ఉరుములు, పిడుగులు సంభవించే అవకాశం ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఉరుములు, పిడుగులు ఉంటాయని అంచనా. ఇదిలా ఉండగా, ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన వాతావరణ వ్యవస్థ రానున్న రోజుల్లో మరింత బలపడనుంది. సెప్టెంబర్ 18న అల్పపీడనంగా మారిన ఈ వ్యవస్థ సెప్టెంబర్ 21 నాటికి వాయుగుండంగా, సెప్టెంబర్ 22 నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇది ఒడిశా-ఆంధ్రప్రదేశ్ తీరంవైపు కదులుతూ సెప్టెంబర్ 23 ప్రాంతంలో ఆ తీరాన్ని చేరే అవకాశం ఉంది. దీని ప్రభావంతో వచ్చే వారం తూర్పు భారతదేశంలోని వర్షపాతంపై ప్రభావం పడే అవకాశం ఉంది. బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట సందడి (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!

Original source: sakshi.com
Read more on Kaizer News