Kaizer News

Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్‌ అరెస్ట్..

· National - India · ntvtelugu.com

Saurav Gurjar: మహాభారతం సీరియల్ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్‌పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక యువతిని శారీరకంగా, మానసికంగా వేధించాడంటూ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. బాధితురాలి కథనం ప్రకారం.. 2021లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సౌరవ్ గుజ్జార్‌తో పరిచయం ఏర్పడగా, ఆ తర్వాత వాట్సాప్ వేదికగా వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధం కొనసాగింది. 2021 డిసెంబర్ 25న వారు తొలిసారి కలుసుకున్న సమయంలో భార్యతో సమానంగా చూసుకుంటానని అతడు హామీ ఇచ్చాడని బాధితురాలు పేర్కొంది. తామిద్దరం అమెరికాలో ఉన్నప్పుడే కాకుండా, భారత్‌కు వచ్చిన తర్వాత కూడా కలిసి జీవించామని వెల్లడించింది

Original source: ntvtelugu.com
Read more on Kaizer News