Bandla Ganesh | నటుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత అగ్ర నిర్మాతగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి బండ్ల గణేష్. నిర్మాతగా ఆయన నిర్మించిన సినిమాలు ఎంతటి సంచలన విజయాలను అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రవితేజతో ‘ఆంజనేయులు’, పవన్ కళ్యాణ్‌తో ‘గబ్బర్ సింగ్’, జూనియర్ ఎన్టీఆర్‌తో ‘బాద్‌షా’, ‘టెంపర్’, అల్లు అర్జున్‌తో ‘ఇద్దరమ్మాయిలతో’ వంటి భారీ చిత్రాలను నిర్మించి బాక్సాఫీస్ వద్ద విజయాలు అందుకున్నారు