Kaizer News

తెలుగులో ‘బెత్లెహెం కుడుంబ యూనిట్‌’

తెలుగులో ‘బెత్లెహెం కుడుంబ యూనిట్‌’

· Entertainment · ntnews.com

నివిన్‌ పౌలీ, మమితాబైజు జంటగా నటించిన మలయాళ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘బెత్లెహెం కుడుంబ యూనిట్‌’ ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సెప్టెంబర్‌ 4న తెలుగులో విడుదల చేయబోతున్నారు. ఇటీవల ట్రైలర్‌ను విడుదల చేశారు. ఊరిలో క్యాటరింగ్‌ బిజినెస్‌ చేసే ఓ యువకుడు, విదేశాల్లో చదువు పూర్తి చేసుకొని సొంతూరికి వచ్చిన ఓ అమ్మాయి మధ్య ప్రేమకథ ఇది. వినోదం, కుటుంబ బంధాలు, పల్లెటూరి నేపథ్యంతో సాగే ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైనర్‌ ఇదని, తెలుగు ప్రేక్షకుల్ని కూడా మెప్పిస్తుందనే నమ్మకం ఉందని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: విష్ణు విజయ్‌, దర్శకత్వం: గిరీష్‌ ఏడీ

Original source: ntnews.com
Read more on Kaizer News