Shorts ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పండుగకు రంగం సిద్ధమైంది. సోమవారం రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం సమక్షంలో భారీగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్న నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం ఆత్మకూరులో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులతో సమావేశం నిర్వహించి కార్యక్రమాలను విజయవంతం చేయడంపై దిశానిర్దేశం చేశారు.ఆత్మకూరు నియోజకవర్గానికి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, హౌసింగ్, ఐ&పీఆర్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూఖ్ హాజరుకానున్నారని మంత్రి ఆనం తెలిపారు. ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్ రావు, ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర, శ్రీకాంత్, బల్లి కళ్యాణ్ తదితరులు, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీతో పాటు అధికార యంత్రాంగం కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. అందరూ కలిసి ఆత్మకూరులో రేపటి కార్యక్రమాన్ని ఒక పెద్ద పండుగలా విజయవంతం చేయాలని మంత్రి ఆనం పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో సుమారు రూ.53.25 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటికే పూర్తయిన సుమారు రూ.10 కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవాలు, మరో రూ.35 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేపట్టనున్నట్లు తెలిపారు.వీటితో పాటు ఆత్మకూరు పట్టణ అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడనుందని చెప్పారు. సెప్టెంబర్ 22న కుప్పం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా ఆత్మకూరు నియోజకవర్గానికి మంజూరైన రూ.29 కోట్ల అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనులకు శంకుస్థాపన చేయనున్నారని మంత్రి ఆనం తెలిపారు. రాష్ట్రంలోని వివిధ పురపాలక సంఘాలు, కార్పొరేషన్లలో అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోందని, అందులో భాగంగా ఆత్మకూరుకు కూడా రూ.29 కోట్ల నిధులు మంజూరయ్యాయని చెప్పారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన జరగడం ఆత్మకూరు అభివృద్ధిలో మరో కీలక ఘట్టమన్నారు.ఇదే సమయంలో ఉదయగిరి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ కార్యక్రమంపై కూడా మంత్రి ఆనం వివరించారు. సెప్టెంబర్ 24న ఉదయగిరి నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహించి, రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.10 వేల కోట్ల ఉపాధి హామీ పథక పనులకు శ్రీకారం చుట్టే కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున ప్రజలను తరలించి విజయవంతం చేయడానికి ప్రతి నియోజకవర్గం నుంచి సమన్వయంతో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులను ఆహ్వానించి ఘనంగా స్వాగతించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.తొలుత మంత్రి ఆనం ఆత్మకూరు టిడ్కో కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీవారి (కోదండ రామస్వామి ఆలయం) ఆలయాన్ని సందర్శి