మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో అయినా, సాయంత్రం స్నాక్స్‌లో అయినా ఉడికించిన గుడ్డు తినడం చాలామందికి అలవాటు. నిమిషాల్లో తయారయ్యే ఈ ప్రోటీన్ పవర్‌హౌస్‌ను తినడం ఎంత ఇష్టమో.. ఉడికించిన తర్వాత దాని పెంకు ఒలవడం ఒక్కోసారి అంత విసుగు తెప్పిస్తుంది. తొక్క తీసే క్రమంలో తెల్లసొన పెంకుకే అంటుకుని గుడ్డు చిందరవందరగా మారిపోవడం చాలా మందికి ఎదురవుతుంది. అయితే వంటగదిలో ఉండే చిన్న వస్తువులతో గుడ్డు పెంకును చిటికెలో ఎలా తీయ్యాలో తెలుసుకుందాం