Kaizer News

‘హౌసింగ్‌ ఏఈ వివేక్‌ను సస్పెండ్‌ చేయాలి’

‘హౌసింగ్‌ ఏఈ వివేక్‌ను సస్పెండ్‌ చేయాలి’

· State - Telangana · ntnews.com

అధికారిక వాట్సాప్‌ గ్రూపులో రాజకీయ పోస్టుపై బీఆర్‌ఎస్‌ నిరసన రాజాపేట, సెప్టెంబర్‌ 19 : రాజాపేట మండల హౌసింగ్‌ ఏఈ వివేక్‌ అధికారిక వాట్సాప్‌ గ్రూపులో మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయ పోస్టు పెట్టారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ మండల నాయకులు నిరసన చేపట్టారు. ప్రభుత్వ అధికారి అధికారిక కమ్యూనికేషన్‌ వేదికలో రాజకీయ పోస్టులు చేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ ఏఈపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సట్టు తిరుమలేష్‌ ఆధ్వర్యంలో శ‌నివారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ భాస్కర్‌రావు అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. ఏఈ వివేక్‌పై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను నిర్ధారిస్తామని, ఆరోపణలు నిజమని తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని అడిషనల్‌ కలెక్టర్‌ హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు నిరసన విరమించారు. అనంతరం ఎంపీడీవోకు వినతిపత్రం అందజేసి ఏఈపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేష్, ఉమ్మడి నల్లగొండ రంగారెడ్డి జిల్లాల మదర్‌ డెయిరీ డైరెక్టర్‌ సందిల భాస్కర్‌ గౌడ్‌, బీఆర్‌ఎస్‌ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పల్లె సంతోష్‌ గౌడ్‌, మాజీ జెడ్పీటీసీ చామకూర గోపాల్‌ గౌడ్‌, నాయకులు గుంటి మధుసూదన్‌రెడ్డి, గోపగాని యాదగిరిగౌడ్‌, వీరేశం, సర్పంచులు బొడ్డు భాస్కర్‌, బాలరాజురెడ్డి, మంత్రాల అనూష సుమన్‌, మాజీ సర్పంచులు బొంగోని ఉప్పలయ్య, రామిండ్ల నరేందర్‌, గుంటి కృష్ణ, చెరుకు కనకయ్య, గొడుగు రాజు, మడోతు లక్ష్మణ్‌నాయక్‌, భోగ హరినాథ్‌, నాగరాజు, కొండం రాజు, కుందనపల్లి నరసింహులు, సీస శ్రీనివాస్‌, యువజన నాయకులు తుంగ అక్షయ్‌, వరిమడ్ల బాలకృష్ణ, మోత్కుపల్లి బాలకృష్ణ, వలభోజు అఖిల్‌, మార్క శివ, పిట్టల వెంకటేష్‌, మిర్యాల ప్రశాంత్‌, కలకుంట్ల ప్రశాంత్‌, తుంగ వేణు, గొర్రెంకల సాయి, అనిల్‌, సతీష్‌, బబ్బురి కార్తీక్‌, బత్తిని వేణు, మిర్యాల మహేష్‌, ఉచ్చేంతల సమ్మీ, తమ్మలి నవీన్‌ పాల్గొన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News