Kaizer News

భక్తి శ్రద్దలతో సారే అందించడం భగవత్ కృప

భక్తి శ్రద్దలతో సారే అందించడం భగవత్ కృప

· State - Telangana · prabhanews.com

ఎమ్మెల్యే అంజిబాబు భీమవరం, ఆంధ్రప్రభ: శివుని అనుగ్రహం, పార్వతీ దేవి ఆశీస్సులు ఉంటే జీవితంలో అంతా మంచిదే జరుగుతుందని, వారిపై నమ్మకంతో భక్తితో కొలిస్తే ఎల్లప్పుడూ ఆ శివపార్వతులు మీకు తోడుగాఉంటారని, భక్తి శ్రద్దలతో సారే అందించడం భగవత్ కృప అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటి చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. పంచరామక్షేత్రమైన భీమవరం సోమేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఆదివారం పార్వతి, అన్నపూర్ణ అమ్మవారికి సుమారు 5000 కేజీల శ్రావణ మాస పట్టి (సారే) అందించారు. శ్రావణ మాస పట్టి ఊరేగింపును ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. శివుడు పరమాత్మ తత్త్వానికి ప్రతీక అని, పార్వతీ దేవి శక్తి స్వరూపిణి అని, ఇద్దరూ కలిసి శివశక్తి ఐక్యంగా విశ్వం నడిపే దైవ దంపతులన్నారు. వందలాది మంది భక్తులు సుమారు 5000 కేజీల శ్రావణ మాస పట్టిను అందించడం శుభ పరిణామమని అన్నారు. అనంతరం సోమేశ్వర ఆలయం నుంచి గుడి చుట్టూ ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో, చైర్మన్, పాలకవర్గ సభ్యులు, భక్తులు, పట్టణ ప్రముఖులు, కూటమి నాయకులు పాల్గొనారు

Original source: prabhanews.com
Read more on Kaizer News