Kaizer News

Koppula Eshwar | కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఇంచు ప్రభుత్

Koppula Eshwar | కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఇంచు ప్రభుత్వ భూమి తేలకుంటే ముక్కు నేలకు రాస్తావా.. సీఎం రేవంత్‌ రెడ్డిని సూటిగా ప్రశ్నించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

· State - Telangana · ntnews.com

22ఏ నిషేధిత భూములపై ప్రశ్నిస్తే కక్షపూరిత చర్యలు ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రధాన నేతలను బదనాం చేసేందుకే భూ సర్వేలు నిర్ధారణ చేయడానికి అధికార యంత్రాంగం ఉండగా మంత్రులు, ఎంపీల సందర్శన ఎందుకు? అక్రమ సంపాదన కోసమే పదవుల్లో రాష్ట్ర మంత్రులు అబద్ధాలు చెప్పడంలో సీఎం రేవంత్ రెడ్డి ది గిన్నిస్ రికార్డు ఎర్ర బస్సు ఎక్కి వచ్చానని చెప్పిన రేవంత్ రెడ్డికి వందలాది ఎకరాల భూములు ఎక్కడివని మాజీ మంత్రి ధ్వజం Koppula Eshwar | ధర్మారం, సెప్టెంబర్ 20 : ప్రజా మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్‌ను బదనాం చేయడానికి కక్షపూరితంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని, మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ఆవరణలోని వ్యవసాయ భూమిలో ఇంచు ప్రభుత్వ భూమి తేలకుంటే తప్పు ఒప్పుకొని రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాస్తాడా.. అని రాష్ట్ర మాజీ మంత్రి, రాష్ట్ర బీఆర్ఎస్ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ ఘాటుగా ప్రశ్నించారు. ఈ మేరకు పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఆదివారం పర్యటించి గణపతి మండపాలను సందర్శించారు. అనంతరం స్థానిక గణేష్ నగర్ లో మీడియాతో ఈశ్వర్ మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రధాన నేతలైన మాజీ సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న కక్షపూరిత చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి నష్టం కలిగించే విధంగా 22ఏను తీసుకువచ్చి లక్షల ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తయని అసెంబ్లీలో ప్రశ్నించిన బీఆర్ఎస్ పై రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశ పూరితమైన చర్యలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. 22 ఏ నిషేధిత జాబితాలో భూములు చేర్చడం వల్ల తప్పు జరిగిందని స్వయాన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో ఒప్పుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. 22ఏ ను సరిదిద్దాల్సింది పోయి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఫామ్ హౌస్ ల పై అధికార పార్టీ ఎంపీలు, నాయకులు సందర్శన ఇందుకు నిదర్శనమని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లోని వ్యవసాయ క్షేత్రంలో అసైన్డ్ భూమి ఉందని రేవంత్ రెడ్డి ప్రకటించడం విడ్డూరంగా ఉందని అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఇంచు ప్రభుత్వ భూమి తేలనిపక్షంలో దానికి బాధ్యత వహించి రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాస్తాడా అని ఈశ్వర్ ప్రశ్నించారు. కేసీఆర్ కు ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ లో కేవలం 62 ఎకరాల వ్యవసాయ భూమి మాత్రమే ఉండగా ఆయన అక్కడ వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తూ ఉంటే దానికి విరుద్ధంగా రూ.లక్ష కోట్ల విలువైన 1,000 ఎకరాల భూమి ఉందని రేవంత్ రెడ్డి మాట్లాడడం ఏమిటని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ పలుమార్లు ప్రజా మద్దతుతో ఎంపీగా, ఎమ్మెల్యేగా ఎన్నికై సీఎంగా, కేంద్ర మంత్రి హోదాలో పనిచేసిన గొప్ప నాయకుడని అలాంటి తమ నేత ప్రభుత్వ అసైన్డ్ భూమిని ఆక్రమించే ప్రసక్తే లేదని ఆయన నీతిగా నిజాయితీగా పట్టా భూములను కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తున్నాడని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చకుండా ప్రజల దృష్టిని మరల్చడానికి పార్టీలో ప్రధాన నేతలుగా ఉన్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పై కావాలని అసైన్డ్ భూములను ఆక్రమించారని ప్రభుత్వం

Original source: ntnews.com
Read more on Kaizer News