Kaizer News

Devarakadra: దేవరకద్రలో మండల సమీక్ష: బెల్ట్ షాపులప

Devarakadra: దేవరకద్రలో మండల సమీక్ష: బెల్ట్ షాపులపై సర్పంచుల ఫైర్!

· State - Telangana · hmtvlive.com

Shorts Devarakadra: ప్రతి 45 రోజులకు ఒకసారి మండల స్థాయిలో సర్పంచ్ లు,సంబంధిత శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో శనివారం మండల స్థాయి సమావేశం నిర్వహించారు. స్పెషల్ ఆఫీసర్ బాలమణి, ఎంపీడీవో శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మండల పరిధిలోని పలువురు గ్రామాల సర్పంచులు,సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో ఆయా గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రజలకు ఎదురవుతున్న సమస్యలు, మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం,తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ తదితర అంశాలపై సర్పంచులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలని సర్పంచులు కోరారు. గ్రామాల్లో ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్న సమస్యలను అధికారులు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సమావేశంలో విజ్ఞప్తి చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా గ్రామాలలో బెల్ట్ షాపులు ఉదయం 5 గంటల నుంచే ప్రారంభమై అర్ధరాత్రి వరకు కొనసాగుతున్నాయని సర్పంచులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.బెల్ట్ షాపుల కారణంగా గ్రామాల్లో యువత మద్యానికి బానిసవుతున్నారని పేర్కొన్నారు.బెల్ట్ షాపులను అరికట్టేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సర్పంచులు అధికారులను కోరారు.బెల్ట్ షాపులు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ ఎస్సై వెంకటేశ్వర్లు వివరణ ఇచ్చారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News