నలుగురికి అదనపు బాధ్యతలు.. తక్షణమే అమల్లోకి ఉత్తర్వులు పరిపాలనా సౌలభ్యం కోసం ఈఓ కీలక నిర్ణయం ఇంద్రకీలాద్రి ఆంధ్రప్రభ : ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో పరిపాలనా సౌలభ్యం, విధుల సమన్వయం కోసం సిబ్బంది బాధ్యతల్లో మార్పులు చేస్తూ ఈఓ శీనా నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శనివారం జారీ చేసిన ఆదేశాల్లో నలుగురు ఉద్యోగులకు కొత్తగా విధులు కేటాయించడంతోపాటు కొందరికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మార్పులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దేవస్థానంలో సూపరింటెండెంట్ వై. హేమదుర్గాంబకు ప్రస్తుతం నిర్వహిస్తున్న ఫెస్టివల్స్–పూజలు, ధర్మపథం, హిందూ ప్రచారం ధర్మం (హెచ్‌డీపీ), సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రచార రథం, ఆడిట్, జనరల్ అండ్ డైవర్షన్స్, సేవాదారుల నమోదు–విధులు, చీరల విభాగంతోపాటు వస్త్రాలు, పూలు, పండ్లకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాల ఫైళ్లను అదనంగా కేటాయించారు. సీనియర్ అసిస్టెంట్ మరుపిళ్ల శ్రీనివాసరావుకు ఈఓకు సంబంధించిన సీసీ, పారిశుద్ధ్య విభాగం, ప్రొవిజన్ స్టోర్ ఫైళ్ల ఉత్తర ప్రత్యుత్తరాల బాధ్యతలతోపాటు ప్రొవిజన్ స్టోర్ ఫైళ్ల నిర్వహణ, స్టాక్ నమోదు, రిజిస్టర్లు, రికార్డుల నవీకరణ, ఖాతాల విభాగం ఫైళ్ల ఉత్తర ప్రత్యుత్తరాల బాధ్యతలు అప్పగించారు. జూనియర్ అసిస్టెంట్ వి. ప్రణీత్‌బాబుకు క్యాష్‌బుక్, ఎఫ్‌డీఆర్ రిజిస్టర్ నిర్వహణ, లెడ్జర్ పరిశీలన, అడ్వాన్స్‌లు–డిపాజిట్ల ధ్రువీకరణ, అకౌంట్స్ రిజిస్టర్లు, అన్ని విభాగాల ఫైళ్ల ఉత్తర ప్రత్యుత్తరాలు, ఆడిట్, జనరల్ విభాగాల ఫైళ్ల బాధ్యతలు కొనసాగిస్తూ, అన్నదానం విభాగం ఫైళ్ల ఉత్తర ప్రత్యుత్తరాలతోపాటు అకౌంట్స్ విభాగానికి సంబంధించిన చెక్కులు, ఆదాయపన్ను పనులను కూడా అప్పగించారు. రికార్డు అసిస్టెంట్ ఎం. జయప్రకాశ్‌కు గతంలో ఉన్న అకౌంట్స్ విభాగం ఫైళ్ల ఉత్తర ప్రత్యుత్తరాల బాధ్యతలతోపాటు ఈఓకు సంబంధించిన సీసీ, పారిశుద్ధ్య విభాగం ఉత్తర ప్రత్యుత్తరాల ఫైళ్లను కేటాయించారు. దేవస్థానం మెరుగైన పరిపాలన ప్రయోజనాల దృష్ట్యా ఈ అంతర్గత మార్పులు చేసినట్లు ఈఓ పేర్కొన్నారు