Shorts పామర్రు: 2014లో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పంట కాలువ రోడ్డు అభివృద్ధికి శ్రీకారం చుట్టింది మనమే.. నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అదే రహదారిని 80 అడుగుల విశాలమైన, సుందరమైన రహదారిగా అభివృద్ధి చేసి ప్రజలకు అందించడం మన అదృష్టం! అని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో అత్యంత సుందరంగా, ఆధునిక ప్రమాణాలతో నిర్మించిన ఈ రహదారి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యంతో పాటు ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపునిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మైనారిటీ సోదరులకు ఆధునిక రహదారి కానుక! అభివృద్ధి అంటే మాటల్లో కాదు.. చేతల్లో చూపించడమే! పంట కాలువ రోడ్డు.. అభివృద్ధి ప్రస్థానానికి ప్రతీకగా నిలుస్తోంది! 80 అడుగుల రహదారి..ఆధునిక ప్రమాణాల నిర్మాణం..సుందరమైన రూపం..ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం..మైనారిటీ ప్రాంతానికి అభివృద్ధి కానుక! “2014లో మొదలైన అభివృద్ధి ప్రయాణం.. నేడు 80 అడుగుల విశాల రహదారిగా సాకారం!”