Kaizer News

Sakinetipalli: ఘనంగా టీడీపీ నేత గొల్ల జస్పాల్ పుట్

Sakinetipalli: ఘనంగా టీడీపీ నేత గొల్ల జస్పాల్ పుట్టినరోజు వేడుకలు

· State - Telangana · hmtvlive.com

Shorts సఖినేటిపల్లి: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లిలో తెలుగుదేశం పార్టీ నేత గొల్ల జస్పాల్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తెలుగుదేశం పార్టీ నాయకుడు, సోషల్ మీడియా యాక్టివిస్ట్ మహాసేన రాజేష్ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా గొల్ల జస్పాల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై జస్పాల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రాజేష్ అభిమానులు, యువత పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News