Kaizer News

ప్రశాంతంగా నీట్‌ పీజీ

· State - Telangana · sakshi.com

నల్లగొండ : నల్లగొండలోని ఎస్‌పీఆర్‌ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన నీట్‌ పీజీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగిన ఈ పరీక్షకు మొత్తం 180 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 179 మంది హాజరుకాగా ఒకేఒక్క అభ్యర్థి గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ తనిఖీ చేశారు. సెంటర్‌ ఇన్‌చార్జితో పరీక్ష నిర్వహణకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పరీక్షను నిర్వహించినట్లు తెలిపారు. కలెక్టర్‌ వెంట అదనపు సూపరింటెండెంట్‌ రమేష్‌, ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐ ఆదిరెడ్డి, పరీక్షల ఇన్‌చార్జి, ప్రొఫెసర్‌ ఉపేందర్‌ ఉన్నారు. ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు) ‘రోమాంచకం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా విజయ్‌ దేవరకొండ (ఫొటోలు) నల్గొండ జిల్లాలో ఘనంగా శ్రావణ మాసం బోనాలు (ఫొటోలు) శిలాఫలకం తప్ప... వెలిగొండకు నువ్వు చేసిందేమిటి? బాబు క్రెడిట్ చోరీపై జగన్ రియాక్షన్ ఆసియా కప్ లో భారత మహిళల సత్తా.. థాయ్ లాండ్ పై తిరుగులేని గెలుపు.. రౌడీషీటర్ కమ్మసాయి దారుణ హత్య.. అసలేం జరిగింది..?

Original source: sakshi.com
Read more on Kaizer News