Kaizer News

భారీ వర్షానికి రహదారిపై కూలిన చెట్టు

భారీ వర్షానికి రహదారిపై కూలిన చెట్టు

· State - Telangana · prabhanews.com

రాకపోకలకు తీవ్ర అంతరాయం.. పట్టించుకోని అధికారులు బాసర, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి చెట్టు రహదారిపై కూలిపోయింది. వివేకానంద చౌక్ నుంచి ఆలయానికి వెళ్లే మార్గంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రహరీ గోడను ఆనుకుని ఉన్న చెట్టు రోడ్డుపై పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షం పడుతున్న సమయంలో అటువైపు వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. చెట్టు కూలి రోడ్డుపై పడినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామం నుంచి ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారి కావడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోందని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారిపై కూలిన చెట్టును తొలగించి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని వారు కోరుతున్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News