Kaizer News

రాష్ట్రస్థాయి వచన కవితా పోటీలో షఫీకి ప్రథమ స్థానం

రాష్ట్రస్థాయి వచన కవితా పోటీలో షఫీకి ప్రథమ స్థానం

· State - Telangana · prabhanews.com

ఉరవకొండ, ఆంధ్రప్రభ : మండలంలోని రాకెట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎస్.ఎం.డి. షఫీ రాష్ట్రస్థాయి వచన కవితా పోటీలో ఉత్తమ కవితా విజేతగా నిలిచారు. ‘అక్షర శిల్పం’ ఫేస్‌బుక్ సమూహం ఆధ్వర్యంలో ‘ నేల రాలని నీటి చుక్క ’ అనే అంశంపై నిర్వహించిన వచన కవితల పోటీలో షఫీ రాష్ట్రస్థాయిలో ఉత్తమ వచన కవితా విజేతగా ఎంపికయ్యారు. గతంలోనూ వివిధ సాహిత్య సమూహాలు నిర్వహించిన కవితా పోటీల్లో పాల్గొని పలు విజయాలు సాధించినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు, సిబ్బంది తెలిపారు. వైద్య ఉద్యోగిగా బాధ్యతలు నిర్వహిస్తూనే కవితా రచనను కొనసాగిస్తూ రాష్ట్రస్థాయి పోటీలో విజేతగా నిలవడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్.ఎం.డి. షఫీని పలువురు అభినందించారు

Original source: prabhanews.com
Read more on Kaizer News