Kaizer News

Greenland-Sovereignty : గ్రీన్ ల్యాండ్ రెడ్ లైన్‌…

Greenland-Sovereignty : గ్రీన్ ల్యాండ్ రెడ్ లైన్‌…! Andhra Prabha Top Story

· National - India · prabhanews.com

గ్రీన్ ల్యాండ్ రెడ్ లైన్‌…! Andhra Prabha Top Story ఆర్కిటిక్‌ ప్రాంతంలో వ్యూహాత్మక ఆధిపత్యం కోసం అమెరికా వేస్తున్న అడుగులు కొత్త దౌత్య ఉత్కంఠకు తెరతీస్తున్నాయి. గ్రీన్‌లాండ్‌పై అమెరికా సైనిక ఉనికిని గణనీయంగా పెంచుకునేందుకు ఒప్పందం కుదిరిందన్న ప్రకటన వెలువడిన వేళ.. ఆ ద్వీపంపై తమ సార్వభౌమాధికారానికి ఎలాంటి భంగం కలగనివ్వబోమని డెన్మార్క్‌, గ్రీన్‌లాండ్‌ స్పష్టం చేశాయి. అయితే, ఈ ఒప్పందం ద్వారా గ్రీన్‌లాండ్‌ భద్రతపై అమెరికాకు శాశ్వత నియంత్రణ లభిస్తుందని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించడం చర్చనీయాంశమైంది. అసలు ఒప్పందంలో ఏముంది? అమెరికాకు ఎలాంటి అధికారాలు దక్కనున్నాయి? అన్న అంశాలపై ఇంకా స్పష్టత లేదు. శుక్రవారం రాత్రి అమెరికా, డెన్మార్క్‌, గ్రీన్‌లాండ్‌ ఈ ఒప్పందానికి వచ్చినట్లు ప్రకటించాయి. ఆర్కిటిక్‌ ద్వీపంలో అమెరికా గణనీయమైన సైనిక ఉనికిని అభివృద్ధి చేసుకునేందుకు వీలు కల్పించడంతోపాటు.. అమెరికా ప్రత్యర్థి దేశాలు అక్కడ తమ సైనిక స్థావరాలను ఏర్పాటు చేయకుండా నిరోధించడమే ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. గ్రీన్‌లాండ్‌లో అమెరికా సైనిక బలగాల పరిమాణం ఎంత? విదేశాంగ విధానం, సహజ వనరులకు సంబంధించిన అధికారాల్లో ఏమైనా వాటా ఇవ్వనున్నారా? అన్న కీలక వివరాలు మాత్రం బహిర్గతం కాలేదు. వచ్చే వారం ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామంటూ ట్రంప్‌ చేసిన హెచ్చరికలతో నెలల తరబడి కొనసాగుతున్న అనిశ్చితికి ఒప్పందంతో తెరపడుతుందని డెన్మార్క్‌, గ్రీన్‌లాండ్‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అయితే, తమ దేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టం చేస్తున్నాయి.వచ్చే వారం గ్రీన్‌లాండ్‌, డెన్మార్క్‌, అమెరికాలకు మంచి సమయం కావచ్చని డెన్మార్క్‌ విదేశాంగ మంత్రి లార్స్‌ లోకే రాస్ముస్సెన్‌ శనివారం ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. నెలల తరబడి కొనసాగుతున్న అనిశ్చితికి ముగింపు పలుకుతూ.. ఆర్కిటిక్‌, ఉత్తర అట్లాంటిక్‌ ప్రాంతాల్లో భద్రతను బలోపేతం చేసే, నాటోతోపాటు యూరప్‌ ఉమ్మడి భద్రతకు దోహదపడే బంధనాత్మక ఒప్పందం కుదురుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో డెన్మార్క్‌ రాజ్యం నిర్దేశించుకున్న ఎర్రగీతలను గౌరవించాల్సిందేనని తేల్చిచెప్పారు. అమెరికాతో సంబంధాలు మరింత బలోపేతం కావడంపై గ్రీన్‌లాండ్‌ రాజధాని నూక్‌లో కొందరు నివాసితులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అమెరికా గ్రీన్‌లాండ్‌ను నియంత్రించకూడదని 65 ఏళ్ల జాకబ్‌ లుడ్విగ్‌సెన్‌ అభిప్రాయపడ్డారు. నాటోతో కలిసి పనిచేయడమే మెరుగైన మార్గమని పేర్కొన్నారు.ట్రంప్‌ గ్రీన్‌లాండ్‌కు చాలా.. చాలా.. చాలా దూరంగా ఉండాలని 71 ఏళ్ల రిటైర్డ్‌ చెఫ్‌ మరియాన్నే హాన్సెన్‌ వ్యాఖ్యానించారు. తమ పిల్లలు, మనవళ్లు భవిష్యత్తులో అమెరికన్లుగా మారాలని ఆయన ఆశించకూడదని స్పష్టం చేశారు.గ్రీన్‌లాండ్‌ అమ్మకానికి లేదని, డెన్మార్క్‌ రాజ్య సార్వభౌమాధికారాన్ని అమెరికా గౌరవించాల్సిందేనని డెన్మార్క్‌, గ్రీన్‌లాండ్‌ నేతలు ఇప్పటికే పలుమార్లు తేల్చిచెప్పారు. ఒప్పందంపై ట్రంప్‌ చేసిన ప్రకటన మ

Original source: prabhanews.com
Read more on Kaizer News