Kaizer News

AP Rains: రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం -ఈ జిల్లాలకు

AP Rains: రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం -ఈ జిల్లాలకు వర్ష సూచన..!

· State - Telangana · telugu.oneindia.com

ఎల్ నినోతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ కు మరో చల్లని కబురు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్ధితుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. ఈ మేరకు వాతావరణ విభాగం తమ అంచనా వెల్లడించింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు సాయంత్రానికి ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావం రాష్ట్రంలోని పలు జిల్లాలపై ఉండబోతోంది. ఆగని మంగళగిరి FBI రచ్చ..! ఏకేస్తున్న జాతీయ మీడియా..! రేపు బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం క్రమంగా బలపడి, మూడు నాలుగు రోజులలో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో రేపు మన్యం, అల్లూరి, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు (Rains), మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. Recommended For You ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో దానం పోటీ చేయొచ్చా ? చట్టం ఏం చెబుతోంది? కాబట్టి ఆయా జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటల నాటికి అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 70.2మిమీ, నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో 50.12మిమీ, అనకాపల్లి జిల్లా బలిఘట్టంలో 48.5మిమీ, కృష్ణాపురంలో 46మిమీ, పెదబొడ్డేపల్లెలో 41.5మిమీ, విజయనగరం జిల్లా కొత్తవలసలో 39.7మిమీ, కాకినాడ జిల్లా రౌతలపూడిలో 21.2మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది. రేపు అల్పపీడనం కారణంగా వర్షాల ప్రభావం మరింత పెరకబోతోంది. దీంతో ఉక్కపోత నుంచి ప్రజలకు కాస్త ఊరట దక్కే అవకాశం ఉంది

Original source: telugu.oneindia.com
Read more on Kaizer News