డీసీఎం ఢీకొనడంతో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు.. వాహనంలో ఇరుక్కున్న డ్రైవర్‌ను కాపాడిన హైవే సిబ్బంది, స్థానికులు ఎర్రవల్లి, ఆంధ్రప్రభ: జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచుపల్లి సమీపంలోని జాతీయ రహదారి–44పై శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీచుపల్లి వద్ద ఓ లారీ మలుపు తిరుగుతున్న సమయంలో కర్నూలు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం వాహనం లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో డీసీఎం డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా, పెద్ద ప్రమాదం తప్పింది. ఢీకొన్న తీవ్రతకు డీసీఎం వాహనంలోని డ్రైవర్ సీట్లోనే ఇరుక్కుపోయాడు. విషయం తెలుసుకున్న హైవే సిబ్బంది, పోలీసులు, స్థానికులు, ఇతర వాహనదారులు వెంటనే స్పందించి డ్రైవర్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రమాదం కారణంగా కొంతసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, స్థానిక పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు